Water melon: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పుచ్చకాయలు, మామిడి కాయలు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఎండాకాలంలో పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. పుచ్చకాయలో ఆధిక శాతం నీరు ఉంటుంది.అందుకే వేసవి కాలంల ఈ పండు తినడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే శరీరం కూడా డీహైడ్రెట్ అవ్వకుండా చేస్తుంది. అంతేకాకుండా పూచ్చకాయను తినడం వలన శరీరంలో వేడి తగ్గడంతో పాటు చలవ కూడా చేస్తుంది. ఎండాకాలంలో తినడం ఎంతో మేలు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Water melon: పుచ్చకాయలోని పోషకాలు ఏంటంటే..
పుచ్చకాయలో పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్లు బి 1, బి 6, సి, డి, లైకోపీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామంది ఈ పుచ్చకాయను చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరి తింటారు. నిజానికి అలా పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టి తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.పుచ్చకాయను సరైన సమయంలో, సరైన మార్గంలో తినడం అనేది చాలా ముఖ్యమైన విషయం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా..?
పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల దానిలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా అలా ఫ్రిడ్జ్ లో పెట్టిన పూచ్చకాయను తినడం ఆరోగ్యానికి కూడా హానికరం అని అంటున్నారు నిపుణులు.పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి తింటేనే అందులోని పోషకాలు ఎక్కడికి పోకుండా ఉంటాయి. అలా కాకుండా చల్లదనం కోసం పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచితె పుచ్చకాయలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి.తాజాగా జరిగిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది..పుచ్చకాయను శీతలీకరించడం వల్ల అందులోని పోషకాలు నశించిపోతాయి అని పరిశోధనలో తెలిసింది.
పుచ్చకాయను ఎలా తింటే ఆరోగ్యకరం :
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పుచ్చకాయను కోసిన తరువాత కూడా అందులోని పోషకాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. కానీ అలా కోసిన దానిని రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల పోషకాల ఉత్పత్తి ప్రక్రియ నెమ్మదిస్తుంది లేదంటే ఆగిపోతుంది. నిజానికి ఈ పుచ్చకాయ అనేది 14 నుంచి 21 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అందుకనే పుచ్చకాయలను గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. ఇలా అయితేనే పుచ్చకాయలో పోషకాలు అన్ని మన శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. అలాగే ఈ పుచ్చకాయను రాత్రిపూట తినడం కంటే పగటిపూట తింటే ఆరోగ్యానికి మేలు. జరుగుతుంది.