Weight Loss: బరువు తగ్గించుకోవాలనుకునే వారు కచ్చితం ఎంచుకునే మార్గంగా వోట్స్ మారాయి…. షాప్స్ లో వివిధ రకాల వోట్స్ ప్యాకెట్లు అమ్మకానికి ఉంటున్నాయి. అయితే కొన్ని రకాల వోట్స్ ప్యాకెట్లలో వివిధ పదార్థాల ఎసెన్స్ కలపడం వలన అదనపు కేలరీలు వచ్చే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు డాక్టర్స్ .వోట్స్, వోట్మీల్ తినడం వల్ల అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఐతే ఈ కారణంగా వ్యక్తి కి ఒక రోజూ కు అవసరమైన పోషకాలు అందవు అని గమనించాలి. వోట్మీల్ చాలా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం, ఇది ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆహారం అని అనుకోవటం పొరపాటు.
బరువు తగ్గాలన్న ఆలోచనలో చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వోట్స్ తింటూ మరే ఇతర ఆహార పదార్థాలను తినరు. ఇలాంటివారికి బరువు తగ్గడం పక్కన పెడితే.. కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఫిట్నెస్ లో మంచి ఫలితాలు పొందాలంటే, మీ డైటీషియన్ చెప్పినట్లుగా లేదా సూచించిన విధంగా ఓట్స్ హోం పాటు మిగతా ఆహారాన్ని తీసుకోవాలి. వోట్మీల్ తయారు చేయడం లో సరైన పద్ధతులు తెలుసుకోవాలి.ఆ విధం గా నే తయారు చేసుకొని తినడం వలన మంచి ఫలితాలను పొందుతారు.
రోజంతా నీరు ఎక్కువగా తాగాలి.ఆల్కహాల్ లేదా ఇతర కేలరీలను పెంచే ఆహారాన్ని తీసుకోకూడదు.ఫిట్నెస్ సూత్రాలకు కట్టుబడి ఉండాలి.ఎట్టి పరిస్థితులలో కూడా వాటిని అతిక్రమించకూడదు. అలా కొన్ని రోజుల పాటు క్రమశిక్షణ తో చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ప్రతి రోజూ రాత్రి తగినంత నిద్ర పోవాలి.