Dust Allergy : డస్ట్ అలర్జీ ఉంటే దాని వల్ల పడే బాధ అంతా ఇంతా కాదు. కొంచెం దుమ్ము లేసినా కానీ హచీ.. హచీ.. అని తుమ్ములను వసుస పెట్టి తుమ్మాల్సిందే. తినే వాటిలో కూడా రిస్టిక్షన్స్ పెట్టుకోవలసిందే. లేకపోతే పలు సమస్యలు వస్తాయి. ఒక్కసారైనా ఆదమరిచి వ్యవహరించామో డస్ట్ అలర్జీ ఎఫెక్ట్ మారీ దారుణంగా తయారవుతుంది. అయితే ఈ డస్ట్ అలర్జీకి మన ఇంట్లో ఉండే వాటితోనే చెక్ పెట్టొచ్చు. వాటి గురించి మీరు కూడా తెలుసుకోండి ఇక..
ఈ అలర్జీకి కారణాలు:
ఈ డస్ట్ అలర్జీ రావడానికి ముఖ్య కారణం దుమ్ము. ఈ అలర్జీకి కొందరిలో బొద్ధింకలు కూడా కారణం అవుతాయి. ఫంగస్, దుమ్ము వల్ల ఈ అలర్జీ మరింత పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల రేణువుల నుంచి కూడా ఈ సమస్య పెరుగుతుంది. పూలు, చెట్లు, గడ్డి నుంచి కూడా డస్ట్ అలర్జీక్ రియాక్షన్స్ వస్తాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ అలర్జీతో వరుసగా తుమ్ములు, ముక్కులో నుంచి నీరు, దగ్గు వస్తాయి. అలాగే దురద, కళ్లు ఎర్రబడటం, శ్వాసలో లాంటి పలు సమస్యలు కూడా వస్తాయి.
ఈ అలర్జీ తగ్గాలంటే:
తేనెను రోజు రెండు స్పూన్లు తాగాలి. ఇది డస్ట్ అలెర్జీని నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పుప్పొడి ధాన్యాలు వల్ల కలిగే అలెర్జీలకు కూడా తేనె మందుగా పనిచేస్తుంది.అలాగే రోజుకు రెండు టీ స్పూన్ల వెనిగర్, ఓ గ్లాసు వేడి నీళ్లు కొంచెం తేనె కలుపుకుని మూడుసార్లు తాగాలి. ఇది డస్ట్ అలర్జీని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ సూక్ష్మజీవుల లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో ఇది డస్ట్ ఎలర్జీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే అరకప్పు పాలలో సగం స్పూన్ పసుపు కలుపుకుని తీసుకోవాలి. ఇది కూడా చక్కగా పని చేస్తుంది.