Teenage Children: మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా ? తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి

Share

Teenage Children: థర్టీన్ నుంచి నైన్ టీన్ వరకు వున్న  ఏజ్ నే  టీనేజ్  అంటారు. టీనేజ్ కి వచ్చిన పిల్లల ఆలోచనలు  ఎప్పుడు ఎలా  ఉంటాయో తెలుసుకోవడం కష్టం. వాళ్లకు మూడ్ స్వింగ్స్ అనేది చాలా  ఎక్కువగా   వస్తుంటాయి. ఒక్కసారి సంతోషంగా మరోసారి కోపం, చిరాకు  వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు పేరెంట్స్ తో సరిగ్గా మాట్లాడేందుకు కూడా  ఇష్టపడరు. మనం ఏం అడిగినా నిర్లక్షయం గా సమాధానం చెబుతున్నట్టు అనిపిస్తుంది.  ఇలాంటి  సమయాల్లో నే వారిని  చాలా జాగ్రత్తగా   దారికి తెచ్చుకోవాలి. లేదంటే వారు పూర్తిగా చేయి దాటిపోయే ప్రమాదం ఉంది.  ఇలాంటి పరిస్థితుల్లో   కొట్టడం, తిట్టడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అసలే తెలిసి తెలుయని తనం పయిగా మూడ్ స్వింగ్స్ దానికి తోడు కొట్టడం తిట్టడం వంటివి చేస్తే    వారికి మీపై ఉన్నకోపం మరింత పెరుగుతుంది. కాబట్టి వారు ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు   వారి మాటలను పట్టించుకోకుండా  కాసేపు వారిని అలా వదిలేయడం మంచిది.  కొద్దీ సేపటికి వారు నెమ్మదించిన  తర్వాత వారితో ఒంటరిగా కూర్చొని అన్ని ప్రేమతో వివరం గా తెలియచేయండి . వారికి ఎందుకు అంత కోపం వచ్చిందిఅనేది తెలుసుకుంటే…  వారికి అస్తమానం  కోపం రావడానికి గల కారణాలు   తెలుసుకోవచ్చు.  వారికి కోపం ఎందుకు వస్తుందో  తెలిసింది  కదా అని వారికి కోపం  రాకుండా  ఉండేందుకు వారికి నచ్చినవన్నీ   చేయకూడదు. చాలామంది టీనేజర్లు తాము ఏది  అడిగితే అది  కావాలని మొండి పట్టు  గా ఉంటారు. అది వారికి దొరకనప్పుడు మీ పై కోపం, చిరాకు  ప్రదర్శిస్తుంటారు.
అలాంటప్పుడు మీరు వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి  ఇవ్వాలని అనుకోవద్దు. వారికి అవసరం అని అనిపిస్తే మాత్రమే ఇవ్వండి.  పిల్లలకు కూడా  అదే  విషయం అర్థమయ్యేలా చెప్పండి. చాలామంది  పేరెంట్స్ పిల్లలు కొంత వయసు వచ్చేవరకు స్నేహితుల్లా బాగానే ఉంటారు. కానీ టీనేజ్ లో కి అడుగుపెట్టిన వారు   పెద్దవారితో సమయం గడిపేందుకు పెద్దగా  ఆసక్తి చూపించరు. దీనికి మారిన వారి మనస్తత్వం కూడా ఒక కారణం గా ఉండవచ్చు . కానీ మీరు మాత్రం  ఇంతకూ  ముందులాగే  వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. వారికీ వచ్చే  కోపాన్ని  అదుపు చేసుకునేందుకు  వివిధ మార్గాలు  చూపండి. యోగా, ధ్యానం తో పాటు  కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవకుండా  కాసేపు ఆలోచించడం వాటిని   నేర్పడం వల్ల అది వారికి భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది.  ఏదైనా సందర్భంలో మీ టీనేజ్ పిల్లలు మీపై అరుస్తూ ఉంటే మీకు కూడా   కోపం వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు గొడవ  కు కారణం అవుతుంది. ఇలా గొడవలు జరగకుండా  ఉండటానికి  మీరు కూడా కోపాన్ని అదుపు చేసుకోవడం  ప్రాక్టీస్ చేయాలి.  గొడవ మరీ   ఎక్కువ అవుతుంది అని అనిపించినప్పుడు బయటకు వెళ్లిపోయి కొంత సమయం తర్వాత ఇంటికి రావడం మంచిది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ విషయాన్ని మాట్లాడుకోవచ్చు.
  అలాని పిల్లలపై  పూర్తిగా కోప్పడడం మానవద్దు.   అలా మానేస్తే వారు మరింత దురుసుగా  మారె అవకాశం ఉంది. వారిని మందలించడం అనేది ఎంత వసరమో    వారిని ఎప్పుడు మందలించాలి అనేది తెలిసి ఉండడం కూడా అంతే అవసరం.  మీకు కోపం వచ్చిన ప్రతిసారి  కోప్పడకుండా అవసరమైనప్పుడే  దాన్ని చూపించాలి .  అస్తమానం కోపం చూపించడం వల్ల వారు దానికి అలవాటు పడిపోయి మీరు ఏమి చెప్పిన  దానిపై  శ్రద్ధ చూపరు. అందుకే  చీటికి మాటికి  కోప్పడకుండా తప్పని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే  వారిని కొప్పడండి..

Share

Related posts

జనవరి లో పుట్టారా? అయితే మీ గుణగణాలు, ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి!!

Kumar

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఇవి తినాల్సిందే..!

Teja

mens: పురుషులు  బిగుతైన  లోదుస్తులు  వేసుకుంటే ఆ విషయంలో సమస్యలు తప్పవు !!(పార్ట్ -1)

siddhu