ఈ రోజుల్లో ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. మనం ఆరోగ్యంగా ఉన్నాం అంటే.. అన్ని రోగాలను తట్టుకునే శక్తి మన దగ్గర ఉన్నాట్టే.. అందుకోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు తీసుకోక తప్పదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది.. సమయాన్ని గుర్తు చేసే టీ విషయంలో అంటూ పలువురు పరిశోధకులు పలు సూచనలు చేస్తున్నారు.
టీ విషయంలో జాగ్రత్తలు ఏంటి అనుకుంటున్నారా..? మొత్తానికే టీ తాగొద్దని కాదు. కానీ అందులో వాడే చెక్కర గురుంచే ఈ విషయం. అవును తాగే టీలో చెక్కర వాడటంతో అది మన శరీరంలోకి వెళ్లి అధికంగా క్యాలరీలు చేరేలా చేస్తుంది. దీంతో అధిక బరువు పెరిగే అవకాశం ఉంది.
టీ లో చెక్కరకు బదులుగా బెల్లం వాడితే ఈ సమస్య ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ముప్పునుంచి తప్పించడమే కాకుండా.. మనకు బెల్లం మేలు చేస్తుందని తెలుపుతున్నారు.
బెల్లం టీలో వాడటం వల్ల రక్త హీనత నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుందని తెలుపుతున్నారు. మలబద్దకంతో బాధపడేవారికి బెల్లం మేలు చేస్తుంది అని చెబుతున్నారు. టీలో బెల్లం కలుపుకుని తాగడంతో జీర్ణ సమస్యలను పోగొట్టొచ్చని చెపుతున్నారు.
టీలో బెల్లంతోపాటు కొద్దిగా అల్లాన్ని చేరిస్తే.. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. జలుబు, దగ్గు, అలర్జీలు కూడా తగ్గుతాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ చేసే నష్టాన్ని తగ్గిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అయిపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.