వీటిని ఎక్కువగా తీసుకున్న ప్రమాదమేనట.. మీకు తెలుసా?

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే అనుకోని అతిథి లాగా మన జీవితాల్లోకి కరోనా మహమ్మారి ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. మన శరీరంలో అత్యంత రోగ నిరోధక శక్తి ఉండటం వల్ల ఈ మహమ్మారి మన శరీరంలోకి రాకుండా కాపాడుకోవచ్చని ప్రతి ఒక్కరు కషాయాల వెంటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి వంటగదిని ఏకంగా ప్రయోగశాలగా మార్చేశారు.

ఏమాత్రం దగ్గు, జలుబు చేసిన అది కరోనా అని భయపడి మన వంటింట్లో దొరికే మసాలా దినుసులతో కషాయాన్ని చేసుకుని తాగేస్తున్నారు. అయితే ఈ కషాయాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్లే నని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వీటిని ఏ పరిమాణంలో తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

వెల్లుల్లి: వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని వంటలలో ప్రత్యేక రుచి కోసం వాడుతుంటారు. ఇన్ని ఔషధ గుణాలున్న వెల్లుల్లిని ప్రతిరోజు 600 నుంచి 1200 మి.ల్లి మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి మోతాదులో తీసుకోవడం ద్వారా కడుపులో మంట, కాలేయ సమస్యలు,తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వారు వెల్లులికి దూరంగా ఉండాలి.

పసుపు: పసుపు ప్రతి ఒక్క వంటకంలో వాడే పదార్థం. ఇందులో ఎన్నో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ప్రతిరోజు పసుపును 500 నుంచి 1000 మిల్లి మాత్రమే తీసుకోవాలి. మధుమేహం, కిడ్నీ సమస్యలతో బాధపడే వారు పసుపు కి దూరంగా ఉండాలి.

అల్లం: అల్లం ప్రతిరోజు 4 గ్రాములకు మించి తీసుకోకూడదు. అధిక పరిమాణంలో అల్లం తీసుకోవడం ద్వారా కడుపులో మంట, గ్యాస్ ఏర్పడటం జరుగుతుంది. అంతేకాకుండా గుండె సమస్యలు, మధుమేహంతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు అల్లం వీలైనంత వరకు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

తేనె: తేనె ప్రతిరోజు మూడు టేబుల్ స్పూన్ లకు మించి వాడరాదు. మధుమేహంతో బాధపడేవారు తేనెను అసలు వాడకూడదు.

గ్రీన్ టీ: గ్రీన్ టీ ని ప్రతిరోజు నాలుగు కప్పులకు మించి తాగరాదు. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరాన్ని ఉత్తేజ పరచడానికి దోహదపడతాయి. ఐరన్ లోపం ఉన్నవారు, మైగ్రేన్ తలనొప్పి సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీ కు దూరంగా ఉండాలి.

సిట్రస్ జాతి పండ్లు: నిమ్మజాతి పండ్ల ను రోజుకు 2000 మిల్లీ గ్రాములకు మించి తీసుకోకూడదు. ఆస్తమా, కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం చికిత్స తీసుకుంటున్నవారు సిట్రస్ జాతి పండ్లకు దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం.అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.