Behaviour: మనిషి యొక్క మాటను బట్టి మనిషిని అంచనా వేస్తారు…నోటిని అదుపులో పెట్టుకుని మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతి గా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది అనేది ఎవరు కాదనలేని నిజం.నిలువునా రంపాలతో కోసిన గాయాల బాధ కంటే,మనిషి తన మాటలతో చేసే గాయం యొక్క బాధ వర్ణన తీతం. మనిషి వ్యక్తిత్వం.. అతని మాటల్లో కనిపిస్తుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి నిర్వచనం.ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు మాటలు అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం ఆనందం గా సాగి పోతుంది.
నాలుక అదుపు చేసుకోవడం తెలిసినవారికి.. సాధించలేనిది అంటూ ఏది ఉండదు.తక్కువగా మాట్లాడటం, మంచి విషయాలు మాట్లాడటం మనిషికి గౌరవాన్ని ఇస్తాయి.ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడాలి. మధురమైన మాటల వల్ల మర్యాద పొందవచ్చు.అందుకే అంటారు.. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ప్రియంగా మాట్లాడాలి.ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్లే పలకరిస్తారు అన్నట్టు చూస్తూ ఉండకుండా ఎదుటి వారిని ముందుగా మనమే మాట్లాడటం మంచి పద్దతి.
అసలు మీ మాట కన్నా ముందు మీ చిరునవ్వే పలకరించే విధం గా ఉండాలి.నిజాన్ని మించింది ఏది ఉండదు. కాబట్టి దేనికి భయపడకుండా ఎప్పుడు నిజమే చెప్పాలి.. నిజాన్ని కూడా ఎంతో ప్రేమగా,మంచి గా చెప్పాలి. ఆలోచించకుండా మాట్లాడటం,గురి చూడకుండా బాణం వేయడం తో సమానం.కాబట్టి మాట్లాడిన తర్వాత ఇంకా ఆలోచించడం అనవసరం . కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడటం ఉత్తమం.