మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు తీసుకోవాలి. ఇతర పదార్థాలతో పోలిస్తే సముద్ర ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అనేక పోషక పదర్ధాలు సంమృద్ధిగా అందుతాయని ఇటీవల పరిశోధకులు వెల్లడించారు. మరీ ముఖ్యంగా అత్యంత పోషక విలువలు కలిగిన టాప్ ఆహార పదర్ధాల్లోనూ సముద్ర ఆహార పదర్థాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాల్లోనూ వెల్లడైంది.
సముద్ర ఆహార పదర్థాల్లో చేపలు కూడా ఒకటి. వీటిని ఆహరంగా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సముద్ర చేపల్లో ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన, ఆవశ్యక పోషకాలు ఉంటాయి. అలాగే, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి శరీరానికి అవసరమైన ఖనిజాలకు కూడా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అత్యావశ్యక పోషకాల యొక్క అత్యుత్తమ వనరుల్లో చేపలు కూడా ఒకటి. ఇవి మీ శరీరంలోని కొవ్వునిక్షేపాలను అదుపులో ఉంచడమే కాకుండా శరీరంలోని జీవక్రియలు మరియు ఆలోచనా శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సముద్రపు ఆహారంలో కోవ్వు శాతం ఇతర మాంసాహారం, పాల ఉత్పత్తుల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో వీటిని తీసుకోడం వల్ల రక్తంలో కొవ్వు శాతం నియంత్రణలో ఉంటుంది. చేపలను ఆహారంగా తీసుకోవడంతో శరీరాకృతి కూడా అందంగా తయారవుతుంది. గుండె, కాలేయం, మెదడు మొదలైన ఇతర అవయవాల పనితీరు మెరుగుపరచడంతో సహా అనేక ఇతరత్రా శారీరక విధులలో కూడా సహాయపడగలదు. 2016 లో జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఒక క్రమప్రాతిపదికన చేపలను తీసుకోవడం, మానవ మెదడులోని “గ్రే మాటర్” మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మెదడు కణాల క్షీణతను నిరోధించి, అల్జీమర్స్ వ్యాధి రాకుండా సహాయపడుతుంది.
సముద్ర ఆహారం తీసుకుంటే గుండె పోటును 50 శాతం వరకూ తగ్గించవచ్చుననీ, గుండె సంబంధిత ఇతర వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ ఎస్) వెల్లడించింది. రొయ్యలు, పీతలు, స్క్వీడ్, ఆక్టోపస్లలో మిటమిన్స్, మినరల్స్ మెండుగా ఉన్నాయని తెలిపింది. సాల్మోన్ అనే చేప నుంచి లభించే నూనే గుండె పోటును తగ్గిస్తుంది. వీర్య కాణాల ఉత్పత్తితో పాటు అవి చురుగ్గా ఉండాలంటే సముద్ర ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, వీటిని మోతాదుకు మించి తీసుకుంటే సోడియం శాతం అధికంగా పెరిగే ప్రమాదం కూడా ఉంది.