పిల్లలు ఏవయ్యస్సు నుండి పోర్న్ వీడియోస్ చూస్తున్నారో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు!!

ఎప్పుడు  తీరిక లేకుండా ఉండే తల్లిదండ్రులు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారో పెద్దగా పట్టించుకోరు. అయితే11 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ సైట్లు చూస్తున్నారని అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఈ విషయాన్ని కన్నవారు తెలుసుకునే సరికి పరిస్థితి చేయిదాటిపోతోంది. అప్పుడు వెంటనే పిల్లల మీదకు వెళ్ళిపోయి  కొట్టడం, తిట్టడం, భయపెట్టడం ద్వారా వారిని అదుపు చేయాడానికి  చూస్తారు. కానీ ఆలా చేయడం అస్సలు మంచి పద్దతి కాదు…

పిల్లలు ఏవయ్యస్సు నుండి పోర్న్ వీడియోస్ చూస్తున్నారో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు!!

కాస్త జాగ్రత్తగా  ఇలాంటి పరిస్థితుల్ని సరిదిద్దుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి.ఒక వేళా మీ పిల్లలు పోర్న్ చూస్తున్నట్టు మీకు తెలిస్తే వెంటనే మీ కోపాన్ని బయటపెట్టి ,రచ్చరచ్చ చేసి భయపెట్టొద్దు.. ఆవయ్యస్సులో పిల్లలకు ఏది మంచో, ఏది చెడో అస్సలు తెలియదు.అందుకే ఈ వయస్సు లోనే తల్లిదండ్రులు పిల్లలనిగమనించుకుంటూ ఓర్పుగా వారికి అన్నీ జాగ్రత్తగాతెలియచేయాలి. అలాంటి వెబ్‌సైట్స్ ఎందుకు చూడకూడదో దానివలన నష్టాలు ఏమిటో వారికీ వివరం గా చెప్పాలి.

చాలామంది పిల్లలు మొదటిసారి పొరపాటుగా అలాంటి వీడియోలు చూస్తుంటారు.  ఆన్‌లైన్‌లోని బ్రౌజ్ చేస్తుండగా వచ్చే యాడ్స్‌పై క్లిక్ చేయడం ద్వారానో,స్నేహితులు, ద్వారానో పోర్న్ సైట్లో కి వెళ్తారు. ముందు కొంచెం భయపడిన ఆ తర్వాత అది ఇంకా ఇంకా తెలుసుకో వాలనే ఆలోచనతో వాటిని చూడడం అలవాటుగా మారి పోతుంది. అయితే పిల్లల్ని భయ పెట్టకుండా జాగ్రత్తగాదారికి తెచ్చుకోవాలి .ఒకవేళ మీ మాట వినరనుకుంటే, ఎవరి మాట అయితే వింటారో వాళ్ల తో చెప్పించే ప్రయత్నం చేయాలి. పిల్లలతో ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడగలము అని  మీరుఆలోచిస్తే  పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది.

ఒక్కసారిగా ఇంటర్నెట్ బ్లాక్ చేస్తే నో ఫోన్ ఇవ్వడం ఆపేస్తేనో, సమస్య తీరిపోకపోగా , పిల్లలు మరిన్ని తప్పులు చేసే అవకాశం ఉంది . ఇంకా మొండిగా  తయారయి,మీరు చేయొద్దన్న ప్రతీ పనిని ఖచ్చితం గా చేయాల్సిందే అన్న మనస్తత్వం లో కి  పిల్లలు వచ్చేస్తారు . అందుకే ఈ పరిస్థితిని చాల  జాగ్రత్తగా ఎదురుక్కోవాలి. తల్లిదండ్రుల్లా కాకుండా స్నేహితుల్లా ప్రవర్తించాలి.వారితో  చాల ఎంత దగ్గరగా  గడప గలిగితే అంతమంచిది. కాబట్టి పిల్లలకు అస్సలు ఫోన్ అలవాటు చేయకుండా ఉండడమే ఉత్తమం అని నిపుణులు తెలియచేస్తున్నారు. ఇంక పెద్దలు కూడా పోర్న్ విషయం లో జాగ్రత్తగా ఉండాలి.చాలా సందర్భాల్లో పిల్లలకు పోర్న్‌ కన్పించడానికి ప్రధాన కారణం పెద్దలనే చెప్పాలి.

ఫోన్లోనూ, కంప్యూటర్లోనూ, పెద్దలు అశ్లీలవీడియోలు సైట్లు చూడడం వల్ల అవి హిస్టరీ రూపం లో సేవ్‌ అవడం తో, ఆ హిస్టరీ పిల్లల కంట పడి ఆసక్తితో వాళ్లు ఓపెన్‌ చేసిచూసి వాటికీ అలవాటు పడడం జరుగుతోంది. అలాగే  వీడియోలను ,పోర్న్‌ సైట్లు, యాక్సెస్‌ చేసినప్పుడు మన ఫోన్‌, కంప్యూటర్లో స్టోర్‌ అయ్యే కుకీల వల్ల కూడా ఆ తర్వాత అశ్లీల పాపప్‌ మెసేజ్‌లు రావడం లాంటివిజరుగుతాయి. ఒకప్పుడుమందుకొట్టడం,పొగ తాగడం వంటి వాటిని దురలవాట్లుగా భావించిన వారే ఇప్పుడు ఎవరిష్టం వాళ్లది అనే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు పోర్న్‌ కూడా అదే దశలో ఉంది.

పోర్న్‌ చూస్తే తప్పేంటి అనే స్థితికి మనం చేసురుకున్నాం. ఏది మంచి ఏది చెడు ఏది ఎంతవరకు ఉండాలి  అని గ్రహించే జ్ఞానం మనకు ఉండొచ్చేమో గానీ అభం శుభం తెలియని యుక్త వయ్యస్సు పిల్లలకు తెలియదు. అందుకే మన  ఫోన్లలోనూ ,కంప్యూటర్లలోనూ, కొన్ని ఫిల్టరింగ్‌ మెకా నిజంలను వాడడం ద్వారా మన జాగ్రత్తలో మనం ఉండడం అవసరం. సమాజంలో చాలామందికి పోర్న్ తేలుసుగాని ఇలాంటి కొన్ని రెడీమేడ్‌ టూల్స్‌ ఉన్నాయన్న విషయం తెలీదు. ఈ ఫిల్టరింగ్‌ టూల్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా అశ్లీల సమాచారం మన ఇంటి దగ్గరకు రాకుండాఆపవచ్చు.

పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారితో మంచి చెడుల గురించి చర్చిస్తూ ఉన్న కుటుంబాల్లో ఫోన్ చూడడం చాలా తక్కువగా జరుగుతుంది. పిల్లలకు ఫోన్ ఇచ్చేముందు ,మనము పోర్న్ చూసే ముందు ఒక్కసారి ఆలోచిస్తే భావితరాలు భద్రం గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి.