Children: ప్రతి చిన్న విషయానికి అస్తమానం పిల్లలను దండిస్తే.. వారి మానసిక పరిస్థితి, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతోంది తాజా అధ్యయనం. ఇలా దండనకు గురైన చిన్నారులు పెరిగి పెద్దయిన తర్వాత సంఘ విద్రోహ శక్తులు గా మారే అవకాశం ఉందని అధ్యయనం తెలియచేస్తుంది. ‘పిల్లలపై శారీరక దాడి’ అనే అంశంపై మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ తాజాగా చేసిన పరిశోధనలో ఈ వివరాలు బయటపడ్డాయి. ఈ పరిశోధన లో భాగం గా దాదాపు 69 దేశాల నుంచి డేటా కలెక్ట్ చేసారు. దీని ఆధారంగా తెలిసినది ఏమిటంటే,పిల్లలను పిరుదులపై కొట్టడం వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అని పరిశోధకులు తెలియచేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి పిల్లలను కొట్టడం వలన బాగుపడతారు అనుకోవడం చాలా పొరపాటు అని , అది ఆ చిన్ని మనస్సులను మరింత క్రూరంగా చేయడం తో పాటు, వారు ఒంటరితనం బారిన పడేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు.పిల్లను చిన్నతనంలో కొట్టడం వలన ,రాబోయే రోజుల్లో వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనే అంశంపై ఈ అధ్యయనం జరిగింది. చిన్నతనంలో అస్తమానం దండనకు గురవడం వల్ల పిల్లల్లో కోపం పెరుగుతుంది అని తెలిపారు. స్కూల్ లో వారి ప్రవర్తన సరిగా ఉండదు, ఆ తర్వాత వారు సంఘ విద్రోహ కులుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని తెలియచేస్తున్నారు. పిరుదులపై కొట్టడం అనేది అంత మంచిది కాదు కాబట్టి ,దీనిని నిషేధించడంతో పాటు, ఇందుకు సంబంధించిన నియమాలు, నిబంధనలు పిల్లలకు చెందిన చట్టాల్లో చేర్చాలని తాజా నివేదిక తెలియచేస్తుంది.
కొట్టడం అనే విషయాన్ని పిల్లలు హింస గానే చూస్తారు , అని అది వారి మానసిక ఎదుగుదల కి అత్యంత ముఖ్య పాత్ర పోషించి భవిషత్తులో హింసకు ప్రేరేపించడానికి కారణం అవుతుంది అని అధ్యయనంలో తేలింది. పిల్లల సంరక్షణకు అన్ని దేశాలు నడుం బిగించాలి అని పరిశోధకులు తెలియచేస్తున్నారు. ‘ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తుంటే కొట్టకుండా.. వారి తప్పులు వారికి అర్థమయ్యేలా ప్రేమగా వివరించి చెప్పాలి. అలా చెప్పడం వలన వారికి ఈ సమాజంలో ఒక వ్యక్తి గా ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది. వారికి ఎలాంటి సమస్యలు వచ్చిన ఎదురుకుని ముందుకెళ్లే విధం గా తయారు చేయండి. పరీక్షల్లో ఫెయిల్ అయినా , తక్కువ మార్కులు వచ్చిన కొట్టకుండా జీవితంలో ఎలా గెలవాలి అనేది నేర్పించండి’ అని తల్లిదండ్రులకు అధ్యయనం ఫలితాలు సూచిస్తున్నాయి.