18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

వైరల్: అలసిపోయామంటూ లేఖ రాసిన వైద్యుడు.. కన్నీళ్లు పెట్టిస్తోంది!

Share

కరోనా కారణం వల్ల అన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లు మూత పడిన విషయం మనకు తెలిసిందే. కొన్ని రాష్ట్రాలలో థియేటర్లకు అనుమతి లభించిన సినిమాలను సైతం థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇదే తరహాలోనే తమిళనాడులో కూడా థియేటర్లలో వంద శాతం పెంచుతూ థియేటర్లు తెరవడానికి అనుమతి తెలుపుతూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనా కేసులు పెరుగుతుడడంతో పాటు, కొత్త స్ట్రెయిన్ కేసులు.కూడా నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ విధంగా వంద శాతం అనుమతిని తెలుపుతూ ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం సరికాదని కొందరు భావిస్తున్నారు తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఓ వైద్యుడు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయం గురించి వ్యక్తం చేసిన తీరు ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేసింది అని చెప్పవచ్చు.జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జేఐపీఎంఈఆర్) పుదుచ్చేరిలో రెసిడెంట్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అరవింద్ శ్రీనివాస్ అనే డాక్టర్ థియేటర్లను తెరవడం పై తనదైన శైలిలో స్పందించి ఓ లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆలోచింపజేసింది.

ఆ లేఖలో నేను అలసిపోయాను, నాతో పాటు ఎంతోమంది వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, పోలీస్ అధికారులు ఎంతోమంది అలసిపోయారు. ఊహించని రీతిలో ఎదురైన ఈ మహమ్మారి నుంచి అందరినీ కాపాడేందుకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి అలసిపోయాము. చూసేవాళ్ళకు మా కష్టం గొప్పగా అనిపించకపోవచ్చు.. ఎందుకంటే మా ముందు కెమెరాలు లేవు, మేము ఎలాంటి స్టంట్లు చేయలేదు, మేము హీరోలు కాదు కాబట్టి ఎవరికీ కనబడదు.మాకి కూడా కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి సమయం ఇవ్వండి… అంటూ ఆ డాక్టర్ రాసిన లేక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కరోనా కేసులు తగ్గని నేపథ్యంలో థియేటర్లకు 100% అనుమతి ఇవ్వడంపై ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.దాదాపు రెండున్నర గంటల సమయం పాటు అంత మందిని ఒకే చోట కూర్చోబెట్టడం వల్ల ఈ వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉంటుందని దీని ద్వారా జరిగే ప్రమాదాన్ని ఊహించడం కష్టంగా ఉంది. సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఏ ప్రజా ప్రతినిధి, హీరోలుగా చెప్పుకొనే ఏ ఒక్కరు కూడా వారితో కలిసి సినిమా చూడరు. కాస్త మా పై కనికరం గురించి దీని గురించి మరోసారి ఆలోచించాలని ఇట్లు అలసిపోయిన ఓ వైద్యుడు ఆవేదన అంటూ ఆ లేఖలో రాశాడు. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.


Share

Related posts

YS Jagan : చాన్సే లేదు… మోడీకే డైరెక్టుగా ఆ మాట చెప్పిన జ‌గ‌న్‌

sridhar

ఇక వెండితెరను ఏలేస్తా.. బుల్లితెర బ్యూటీ వర్షిణి

Varun G

Lemon Leaves: నిమ్మ ఆకులు గురించి ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!

bharani jella