ట్రెండింగ్ హెల్త్

ఇలా చేసి డ‌యాబెటిస్ ను నియంత్రించొచ్చు!

Share

డయాబెటిస్.. నేడు ప్ర‌పంచాన్ని ఎంత‌గానో ఇబ్బంది పెడుతున్న వ్యాధి. ఈ వ్యాధికి నేటికి పూర్తి స్థాయిలో చికిత్స లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఇది ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. ఇప్పుడు ఈ వ్యాధి అనారోగ్యానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది. మ‌న చుట్టు ఉన్న ఎంతో మందిలో ఈ వ్యాధికి ఉండొచ్చు. దీనికి ముఖ్య ల‌క్ష‌ణం ర‌క్తంలో చ‌క్కెర శాతం పెర‌గ‌డం. అయితే మ‌న‌కు అందుబాటులో వాటితో ఈ వ్యాధిని నియంత్రించొచ్చు.

ఆరోగ్యవంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌డం, వ్యాయ‌మం చేయ‌డం, టైంకు తినడం, వైద్యులు సూచించిన మందులు తీసుకోవడం చాలా అవ‌సరంం. ఇవి చేస్తే.. డ‌యాబెటిస్ న‌ను చాలా వ‌ర‌కు నియంత్రించొచ్చు. అయితే ఇందులో టైంకు ఆహారం తీసుకోవడం నియంత్ర‌ణ‌లో కీలకం. డయాబెటిస్‌ను నియంత్రించడంలో కొన్ని చాలా ఉప‌యొగ‌ప‌డ‌తాయి. వాటిలో వెల్లుల్లి, దాల్చినచెక్క , నిమ్మకాయ ప్ర‌ధాన పాత్ర పోశిస్తాయి.

ఇందులో వెల్లుల్లి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగిన‌ది. వండినది అయినా లేక‌ పచ్చి వెల్లుల్లైనా స‌రే తినడం వ‌ల‌న‌ డయాబెటిస్‌ను కొంతమేరా నియంత్రించొచ్చని ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ నియంత్రణకు అవసర‌మైన‌ విటమిన్ సి వెల్లుల్లిలో చాలా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు చక్కెరకు బ‌దులుగా దాల్చిన చెక్కను ప్రత్యామ్నాయంగా వాడొచ్చు. అలాగే ఇది ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి డయాబెటిస్ నియంత్రణకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అలాగే దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి మాములు స్థితికి వస్తాయి. దాల్చినచెక్కను రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తినకూడద‌ని వైద్యులు సూచిస్తారు. అలాగే నిమ్మకాయ కూడా డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఏవి పాటించినా వైద్యుల సూచ‌న‌ల మేర‌కే చేయాల‌ని మ‌ర్చిపోవ‌ద్దు.


Share

Related posts

Drama Juniors : డ్రామా జూనియర్స్ ఫన్నీ ప్రోమో అదుర్స్?

Varun G

ఆ విషయం లో ప్రతాపం చూపించేయాలని పిజ్జా,బర్గర్ తింటే ఏమవుతుందో తెలుసుకోండి !!

Kumar

Spanish: ఆరోగ్యానికి మంచిదని పాలకూర ఎక్కువగా తింటున్నారా.!? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి చూసుకోండి..!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar