Sleep : ఒత్తిడితో కూడిన :
ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఎదురుకుంటున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది నిద్ర లేమి సమస్య అని చెప్పవచ్చు. ప్రస్తుతం అధునాతన జీవన విధానం లో ఒత్తిడితో కూడిన జీవితమే ప్రతి ఒక్కరిది. ఈ కారణం గా ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రాత్రి వేళ హాయిగా, ప్రశాంతం గా నిద్రపోవడానికి ఈ చిట్కాలు పాటించి చుడండి.
Sleep :తేలికగా జీర్ణమయ్యేవి:
రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత పడుకోవడానికి దాడుపుగా 3 గంటల సమయం ఉండాలి. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వలన జీర్ణవ్యవస్ధ బలహీనపడుతుంది. అలా అని ఏమి తినకుండా కూడా పడుకోలేము అలా పడుకున్న కూడా నిద్ర రాదు. కాబట్టి రాత్రిళ్ళు తేలికగా జీర్ణమయ్యేవి, ఆరోగ్యకరమైన ఆహారాలు తిన్న తర్వాత కొద్ది దూరం నడిస్తే సరిపోతుంది.
గోరు వెచ్చని నీటితో స్నానం:
నిద్రకు ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లో మాట్లాడుతూ లేదా ఎదో ఒకటి చూస్తూ మాత్రం ఉండకండి. పడుకోవడానికి ఒక గంట ముందే మీరే ఫోన్ వాడకుండా పక్కన పెట్టేయండి. నిద్రపోయేటప్పుడు కచ్చితం గా గోరు వెచ్చని నీటితో స్నానం చేసి ఒంటికి బిగుతుగా ఉండే బట్టలు కాకుండా బాగా లూజ్ గా ఉండి సౌకర్యంగా ఉండేవాటినే వేసుకోండి.
చమోమిలే టీ :
నిద్రించడానికి ముందు గోరువెచ్చని పాలు త్రాగడం అనేది ఎప్పటినుండో ఉన్న పద్దతి. ఇది కూడా మంచి నిద్రని ఇస్తుంది.
చమోమిలే టీ నిద్ర నాణ్యతను కూడా మెరుగు పరచగలదు. రోజూ చమోమిలే టీ తాగే వారి లో నిద్ర లోపం ఉండదు. మాములు టీల మాదిరిగా కాకుండా, చమోమిలే టీ లో కెఫిన్ లేకుండా ఉంటుంది. ఇది ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. కొబ్బరి నీరు శరీరాన్ని శాంతపరచడం తో పాటు మంచి నిద్ర పట్టడానికి కారణం అవుతుంది. కొబ్బరి నీటిలో ఉండే విటమిన్ బి ఒత్తిడి స్థాయిలను తగ్గించడం వలన కూడా మంచి నిద్ర పడుతుంది.