penis: మగవారి శరీరంలో పురుషాంగం చాలా ముఖ్యమైన భాగం. ఇది శరీరానికి గొప్ప మంచి సుఖాన్ని ఇవ్వడం తో పాటు సంతానోత్పత్తికి అత్యంత ముఖ్యమైనది. ఇది మగవారి జీవితాన్ని అర్ధం వంతం చేస్తుంది కాబట్టి కాబట్టి దీనికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.పురుషాంగం చిన్నగా ఉందా పెద్దగా ఉందా, స్ట్రాంగ్ అవ్వడానికి ఏమి చేయాలి అని ఆలోచించడం కాదు దాన్ని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి.
మగవారి జననేంద్రియ భాగం ఎప్పుడు తడిగా , వెంట్రుకలు ఉండడం వలన ఇది బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలకు నివాస స్థానం గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం లో జుట్టు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.సరిగా శుభ్రత పాటించకపోతే చాలా రకాల సమస్యలు వస్తాయి. మగవారు తమ ‘అంగాన్ని’ సంరక్షించుకోవడం లో తేడా జరిగితే, అంగ సౌందర్యంతో పాటు సామర్థ్యం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శుభ్రంగా లేని చేతులతో అస్తమానం హస్త ప్రయోగం చేయడం వల్ల హానికర బ్యాక్టీరియా వృద్ధి చెంది అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శృంగారం పూర్తి అయిన తర్వాత అంగాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే రకరకాల వ్యాధులు వేధిస్తాయి.
శృంగార అనుభూతి పొందడానికి పదే పదే హస్త ప్రయోగం చేయడం వలన శృంగార సామర్థ్యం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .
శృంగార సమయంలో పురుషాంగానికి గొళ్ల నుంచి పంటి నుంచి ఎటువంటి ఒత్తిడి కలిగిన సెఫ్టిక్ అయ్యే ప్రమాదం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. సుఖ రోగాలు ఉండే ఆడ వారితో కండోమ్ ధరించి శృంగారం చేసిన ప్రమాదమే అని గుర్తు పెట్టుకోండి.
పురుషాంగం మీద చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. కాబట్టి శుభ్రపరచుకునే టప్పుడు సున్నితం గా వ్యవహరించాలి.
పురుషాంగం శుభ్రం చేసుకునేటప్పుడు, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పురుషాంగం కడిగితే, ముందు వరకు ఉండే చర్మాన్ని వెనక్కి లాగి మంచి నీటితో శుభ్రం చేయడం వలన దుర్వాసనను,తగ్గించడానికి సహాయపడుతుంది.యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ఉత్పత్తులను వాడటం మంచిది. మురికిగా ఉన్న లోదుస్తులు వేసుకుంటే పురుషాంగాన్ని ,చుట్టూ ఉండే జుట్టుని ఎంత శుభ్రం చేసుకున్న పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతమంతా శుభ్రంగా ఉంచుకుంటూ ఉతికిన కాటన్ వస్త్రాలు వేసుకోవాలి.