న్యూస్ హెల్త్

తినేటప్పుడు వాటర్ తాగవచ్చా.!? తాగకూడదా..!?

Share

భోజనం చేసేటప్పుడు కంచం పక్కనే ఓ గ్లాసు నీళ్లు పెట్టేస్తారు.. అసలు భోజనం చేసేటప్పుడు కానీ.. భోజనం చేసిన తర్వాత కానీ మంచినీళ్లు తాగవచ్చా అని అంటే.. ఆరోగ్య నిపుణులు మాత్రం తాగకూడదని చెబుతున్నారు.. భోజనానికి గంట ముందు భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత మంచి నీళ్లు తాగకుండా ఉండటమే ఉత్తమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. అసలు భోజనం చేసేటప్పుడు ఎందుకు మంచినీళ్లు తాగకూడదో ఇప్పుడు చూద్దాం..!

సాధారణంగా మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది.. ఈ ఆసిడ్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. సాధారణంగా యాసిడ్ లో వాటర్ కలిపితే దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి అంతగా పనిచేయదు.. అలాగే మనం భోజనం చేసేటప్పుడు మంచినీళ్లు తాగితే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణక్రియ వేగవంతాన్ని తగ్గిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి లేట్ అయ్యేలా చేసింది..

మనం ముందుగా మంచినీళ్లు తాగడం వలన 20 నిమిషాలు నుంచి 25 నిమిషాలు జీర్ణం కావడానికి ఆలస్యం అవుతుంది.. హా.. ఒక అరగంటగా లేట్ అయితే లేట్ అయింది అని మంచినీళ్లు తాగుదాం అని అనుకుంటే మాత్రం పొరపాటే.. యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువయ్యే కొద్దీ మీ పొట్టలో ఇరిటేషన్ ఎక్కువైపోయి.. అల్సర్, యాసిడ్ రీఫెక్స్ వస్తాయి తిన్న తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిశోధనలు ఇనిస్ట్యూట్ ఫర్ క్వాలిటీ అండ్ అఫీషియెన్సీ ఇన్ హెల్త్ కేర్ వారు 2009లో చేశారు. అందుకని ఎక్కువగా భోజనం చేసేటప్పుడు మంచినీళ్లు తాగకపోవడమే ఉత్తమం. మీరు అలా మంచినీళ్లు ఎక్కువగా తాగడం వలన గ్యాస్ , అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. దానికి బదులు అన్నం మెల్లగా నమిలి తినడం చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని గొంతు పట్టకుండా తినడమే మంచిదని అంటున్నారు..


Share

Related posts

Marriage: శోభనం  పెళ్లి తర్వాత 2,3 రోజుల్లో వార ,తిథి ,నక్షత్ర సంబంధం లేకుండా    చేస్తున్నారా ?అలా చేయడం వలన జరిగేది ఇదే!!  !!(part-2)

siddhu

మీరు నైట్ అవుల్ అయితే ఈ సమస్యలు తప్పవు

Kumar

వచ్చే 25 ఏళ్లు .. అయిదు లక్ష్యాలు

somaraju sharma