Papaya: ఆరోగ్యకరమైన పండ్లలో బొప్పాయి కూడా ఒకటి.. ఈ పండులో ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలే ఇందుకు కారణం.. బొప్పాయి ఆరోగ్యానికి మంచిదని ఏ పండుతో పడితే ఆ పండుతో కలిపి తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అలా కలిపి తీసుకుంటే అది విషంతో సమానని చెబుతున్నారు.. మరి బొప్పాయిని ఏ పండ్లతో కలిపి తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..!

బొప్పాయి తో అరటి పండు కలిపి తినకూడదు.. ఎందుకంటే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.. అరటి, బొప్పాయి కలిపి తింటే అజీర్ణం, వాంతులు, వికారం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ కాంబినేషన్ ను ముఖ్యంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారు తినకూడదు. బొప్పాయిలో ఉండే పపైన్, బీటా కెరోటిన్ కామెర్ల సమస్యను పెంచుతుంది. గాయాలు, పుండ్లు ఉన్నవారు కూడా ఈ రెండింటినీ కలిపి తినకూడదు..

సాధారణంగా సలాడ్ ఏదైనా నిమ్మరసం కలిపి తీసుకుంటాం.. కానీ బొప్పాయి సలాడ్ కు నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి కంటే ఎక్కువ హని చేస్తుంది.. బొప్పాయి, నిమ్మరసం కలిపి తీసుకుంటే రక్తహీనతను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ అసమతుల్యతకు దారి తీస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ అవాయిడ్ చేయండి.. బొప్పాయి ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ మోతాదులో తినకూడదు.. ఒక కప్పు లేదా 3 సన్నని ముక్కలు సరిపోతాయి. అంతకంటే ఎక్కువ తింటే తల తిరగడం, తలనొప్పి, అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.