హెల్త్

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

Share

కడుపు నొప్పి ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి నెలా రుతుస్రావం క్రమం తప్పకుండా వస్తేనే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.కానీ కొంతమందిలో నెలసరులు అనేవి సరిగా రావు. చాలా మందికి రుతుక్రమం సమయంలో పొత్తి కడుపు దగ్గర పేగులు పిండేసినట్టు నొప్పి వస్తుంది.అయితే ఈ నొప్పి అనేది అందరిలో ఒకేలాగా ఉంటుంది అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే స్త్రీ యొక్క శరీరాన్ని బట్టి నొప్పి తక్కువగా, ఎక్కువగా వస్తు ఉంటుంది. ఆ నొప్పులను భరించలేక కొందరు మందులు కూడా వాడతారు. నిజానికి అలా మందులు వాడే కంటే సహజంగానే నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించే కొన్ని డ్రింకులు తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి క్రమంగా తగ్గుతుంది.మరి ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందామా..

నీరు:

మనం బతకడానికి ఆహారం లేకపోయినా ఒకటి రెండు రోజులు ఉండగలం కానీ. నీరు లేకుండా మాత్రం అసలు ఉండలేము. అలాగే శరీరంలో తగినంత నీరు లేకపోయినా కూడా పొత్తికడుపు నొప్పి అధికంగా వస్తుంది. అందుకే పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గాలంటే నీరు అధికంగా తాగాలి.

అల్లం టీ:

చాలా మందికి టీ అలవాటు ఉండే ఉంటుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గాలంటే అల్లం టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.అల్లంతో చేసే ఆహారాలు తినడం వల్ల పీరియడ్స్‌ కూడా సక్రమంగా వస్తాయి. అలాగే టీలో తురిమిన అల్లాన్ని వేసుకుని తాగితే టీ రుచి కూడా చాలా బాగుంటుంది

మెంతుల టీ:

అల్లం టీ తో పాటుగా మెంతులతో చేసే టీ కూడా పీరియడ్స్ సమయంలో బాగా పనిచేస్తాయి.మెంతుల టీ తాగితే చాలా లాభాలు ఉంటాయి. ఇందులోని గుణాలు పొట్ట కండరాలకు విశ్రాంతిని కలిగిస్తాయి. రుతుక్రమంలో వచ్చే నొప్పి తీవ్రతను కూడా తగ్గిస్థాయి.ఇందులో యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు అధికం కాబట్టి రుతు క్రమంలో వచ్చే తిమ్మిరిని పోగొడతాయి


Share

Related posts

Air Conditioner : ఏసీ వాడకం లో ఈ మెళకువలు  పాటిస్తే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది!!(పార్ట్ -1)

siddhu

బాదం పప్పును తొక్కతీసే ఎందుకు తినాలో మీకు తెలుసా..?

Ram

watermelon: టైమ్ పాస్ కి తినే సొంపు లో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయా!

bharani jella