అద్భుతమైన పోషక విలువలు అమోఘమైన ఔషధ గుణాలు వున్న మునగ ఆకు, మునగకాయలు మరియు మునగ పువ్వుల ఉపయోగాలు తెలుసుకుందాం. మునగ కాయలు, పచ్చి మామిడి కాయలు కలిపి వండిన కూర తింటే వేసవి లో శరీరానికి చలవ చేయడమే గాక మన దేహము నందలి ఐరన్, విటమిన్ ‘సి’ లోపించకుండా ఉంటాయి.
మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును. ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుతున్నట్లయితే ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధముగా పనిచేస్తుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరి నీటిలో ఒక చెంచా మునగ పువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు ఫలితం ఉంటుంది. …బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గును. ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును. మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా వాడితే చర్మవ్యాధులు తగ్గుతాయి. మునగాకు రసములో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగఅగును.ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి తగ్గుతుంది. మునగ ఆకును రోజూ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.