కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో హెల్త్ చెక్ అప్ కోసం హాస్పిటల్కు వెళ్లడమంటే సాహసం చేసినట్లే. అయితే, ఇంట్లో ఉండే మీరు ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? మీ చెవి గులిమితో! నమ్మబుద్ధి కాకపోయినా ఇది నిజమే …చెవిలో ఉండే గులిమి రంగు సైతం మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. చెవుల్లోని గులిమి తీసి శుభ్రం చేసుకుంటున్నా, మళ్లీ మళ్లీ పెరుగుతుంది. గులిమి ఎక్కువ పరిమాణంలో ఏర్పడుతుంటే తప్పకుండా అనారోగ్య సంకేతమని భావించాలి.
చెవిలోని గులిమి బూడిద రంగులో ఉన్నట్లయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.
కాలుష్యం ఎక్కువగా ఉండే.. నగరాల్లో నివసించేవారి చెవిలోని గులిమి ఎక్కువగా బూడిద రంగులో ఉంటుంది.
గులిమితీసినప్పుడు రక్తం వస్తున్నట్లు అనిపిస్తే కర్ణభేరిలో పగుళ్లు ఏర్పడినట్లు.
కర్ణభేరీలో పగుళ్లు ఇన్ఫెక్షన్కు దారి తీస్తాయి. దీనివల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
గులిమి గోదుమ రంగులో ఉంటే, మీరు ఒత్తిడితో ఉన్నారని అర్థం చేసుకోవాలి . ఈ సమయంలోధ్యానం చేయడం లాంటివి చేస్తూ ప్రశాంతంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
గులిమి నలుపు రంగులో ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్గా భావించాలి. నల్లని గులిమి ఉన్నవారికి చెవిలో దురద ఎక్కువగా వస్తుంది. ఈ సమయంలో ఇంటి వైద్యాన్ని నమ్ముకోకుండా వైద్యుడిని సంప్రదించండి ఉత్తమం. గులిమి తెలుపు రంగులో ఉంటే శరీరంలో విటమిన్లు, మూలకాలు లోపం ఉన్నట్లు భావించాలి.
ఐరన్, కాపర్ లోపం ఉన్నవారి గులిమి తెలుపు రంగులో ఉంటుంది.
ఆరోగ్య సమస్య ఏదైనా తొలిదశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకోవాలి.అశ్రద్ద చేయడంవలన సమస్య పెద్దది కావచ్చు.