సాధారణంగా తలనొప్పి అందరికీ వచ్చే ఆరోగ్య సమస్య.. కాకపోతే కొంతమందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది .. ఈ తలనొప్పిని కూడా సాధారణమైనదిగా భావించి నెగ్లెట్ చేస్తూ ఉంటారు కొంతమంది.. ఇది సరైన పద్ధతి కాదని.. ఈ సమస్య పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ తలనొప్పి వెనక చాలా కారణాలు ఉన్నా అంటున్నారు..!
ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి రావడానికి శరీరంలో రక్తం లేకపోవడం కూడా ఒక కారణం.. అదే సమయంలో శరీరంలో ఆక్సిజన్ తగినంత లేకపోయినా కూడా తలనొప్పి తో పాటు బలహీనత మైకం కూడా వస్తుంది.. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకోండి. అవి తక్కువగా ఉంటే మాత్రం మీకు ఉదయం తలనొప్పి వస్తుంది. మీరు డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్న కూడా మీకు ఉదయాన్నే తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిద్రలేమి కారణంగా ఒత్తిడి రాత్రి సమయంలో వర్క్ చేసే వారికి కూడా ఉదయాన్నే తలనొప్పి వస్తుంది..
ఉదయాన్నే తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ చల్లటి నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తాగితే తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమస్య నుంచి అధిగమించడం కోసం ప్రతి రోజు కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోయేలాగా చూసుకోవాలి. యోగ , ధ్యానం, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. ఈ సమస్య మరి తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల్ని సంప్రదించడం మంచిది..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?