NewsOrbit
హెల్త్

పడుకునేటప్పుడు దిండు కింద ఇవి పెట్టుకోండి .. చక్కగా నిద్ర పడుతుంది !

పడుకునేటప్పుడు దిండు కింద ఇవి పెట్టుకోండి .. చక్కగా నిద్ర పడుతుంది !

రాత్రిపూట కావలసినంత నిద్రలేకపోవడం వల్ల పగలు పని మధ్య లో నిద్ర పోవడం. త్వరగా కోపం రావడం, ఏకాగ్రత లోపించడం. మతిమరపు, పనిలో సామర్థ్యం తగ్గిపోవడం ఒత్తిడికి  గురిఅవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పడుకునేటప్పుడు దిండు కింద ఇవి పెట్టుకోండి .. చక్కగా నిద్ర పడుతుంది !

ఇవన్నీ ఎక్కువ రోజులు కొనసాగితే బి.పి., గుండెజబ్బులకు దారి  తీస్తాయి . అలాగే మైగ్రెయిన్ తలనొప్పి, బ్రెయిన్‌స్ట్రోక్, కడుపులో హైపర్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్లు రావడం, యాంగ్జైటీ న్యూరోసిస్, డిప్రెషన్ లాంటి జబ్బులు కూడా వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికీ కంటి నిండా నిద్ర అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి. ఎలాంటి కలత లేకుండా ఎంతో ప్రశాంతంగా నిద్రపోవాలి. అలాంటి నిద్ర రానప్పుడు ఇలా చేసి చుడండి..

రాత్రి నిద్రపోయేప్పుడు కొన్ని యాలకులను వస్త్రంలో చుట్టి దిండుకు దగ్గరగా ఉంచితే పీడ కలల తో పాటు , రాత్రిపూట కలిగే  భయాన్ని కూడా నిరోధించవచ్చు. రాగి పాత్రలో నీరు నింపి రాత్రిపూట మంచము పక్కన తలవైపుగా ఉంచి, ఉదయాన్నే ఆ నీటిని మొక్కలకు పోయడం వల్లమంచి ఫలితం కలుగుతుంది. పడకగది లేదా మంచానికి సమీపంలో చెత్త బుట్ట, షూ, చెప్పుల స్టాండ్ ఉండకుండా చూసుకోవాలి.

పడకగది చిందర వందరగా ఉంటే ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది . కాబట్టి పడకగదిని శుభ్రంగా చల్లగా మీకు నచ్చే సువాసనలు వెదజల్లేలాగా ఉంచుకోవాలి. నిద్రపోయేటప్పుడు దక్షిణం వైపు తల, ఉత్తరం దిక్కునకు కాళ్లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల సుఖ నిద్రతోపాటు వచ్చిన కలలు కూడా నిజమవుతాయి. ఇందులో మతపరమైన నమ్మకాలనే చూడకుండా సైన్స్ కూడా ఉందన్న విషయాన్ని గమనించాలి. నిద్రకు ముందు ఇష్టదైవం లేదా ఇష్టమైన మంత్రాలను ఉచ్ఛరిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.

రోజు నిద్రపోయేప్పుడు ఒక నిమ్మకాయను దగ్గర పెట్టుకోండి. దీని వల్ల గాలి స్వచ్ఛంగా ఉండి మంచి నిద్ర పడుతుంది. నిద్రపోయే ముందు హర్రర్ సినిమాలు, థ్రిల్లర్లు, ప్రమాదాల వీడియోలు, ఫొటోలు చూడకండి. వాటి ప్రభావం మీకు నిద్రపై పడవచ్చు. నిద్రపోయే ముందు పాములు, జెర్రులు  తదితరాల వీడియోలు, ఫొటోలు అస్సలు చూడకండి. వాటి గురించి చదవకండి. ఏదైనా మంచి విషయాన్ని తలచుకుని హాయిగా నిద్రపోండి.

నిద్రపోయే ముందు కాళ్లను  శుభ్రంగా కడుక్కోవాలి. మహిళలు నిద్రపోయేప్పుడు జుట్టు విప్పుకుని ఉండకుండా జడ అల్లి లేదా రబ్బరు బ్యాండ్ పెట్టుకోవాలి. లేకపోతే పీడకలలు రావచ్చు. మీ తలగడ మురికి గా లేకుండా  చూడండి. నిద్రపోయే ముందు దుప్పటిని శుభ్రంగా దులిపి వేసుకోవాలి.పడుకునే ముందు ఒక గ్లాస్ మజ్జిగ  లేదా గోరువెచ్చని పాలు తాగిన కూడా నిద్ర బాగా పడుతుంది.

నిద్రకు ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. నిద్రపోయే ముందు మాడుకు, అరికాళ్ళను కొంచెం నువ్వుల నూనెతో మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. పడకమీదకి చేరిన తరువాత ఫోన్, టీవీ చూడడం, లేదా ఆలోచించడం వంటివి చేయకుండా . నిద్రించేముందు, కొద్ది సమయం యోగా ధ్యానం లేదా తేలికపాటి శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది కండరాలను విశ్రమింపజేసి శరీరాన్ని, మైండ్ ను నిద్రించేటందుకు అనువుగా తయారు చేస్తుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri