Hair loss: బట్టతల రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!!(పార్ట్ -2)

Share

Hair loss:  బట్ట తలకు కారణాలు తెలుసుకుందాం రోజు షాంపూతో తల స్నానం చేయడం వలన జుట్టు  బలహీన పడడం, అది పలుచగా మారడం,బట్టతల వస్తుంది.కాబట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తల స్నానం కోసం షాంపూ ను వాడండి.షాంపూతో తల స్నానం చేసిన తర్వాత కండీషనర్‌  కచ్చితంగా వాడాలి. షాంపూలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి.  కాబట్టి షాంపూ చేసిన తర్వాత కండీషనర్‌ ఉపయోగించడం మర్చిపోవద్దు.

read more : hair loss: బట్టతల రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!!(పార్ట్ -1)

ఇప్పటి యూత్ అంతా హెయిర్‌ ైస్టెల్స్‌ కోసం రసాయనాలతో నిండిన హెయిర్‌స్టైలింగ్ ఉత్పత్తులను వాడుతున్నారు. ఇది జుట్టుకు చాలా నష్టం కలిగిస్తున్నాయి. హెయిర్‌ జెల్‌ వాడడం వల్ల జుట్టు బలహీనంగా మారి బట్టతలకు కూడా కారణం అవుతుంది.అందరు చేసే పెద్ద తప్పేంటి అంటే ..ప్రతిరోజూ బిజీ జీవితంలో తడి జుట్టు తో  ఉండి పోతున్నారు. ఇలా ఉండడం వల్ల జుట్టు రాలడం, చిట్లడం జరుగుతుంది. అందుకే  జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే జుట్టును దువ్వుకోవాలి.
చాలామంది ఎప్పుడు  టోపీ పెట్టుకుని ఉంటారు. ఇలా పెట్టుకోవడం వలన జుట్టుకు సరైన ఆక్సిజన్‌ సరఫరా లేక  జుట్టు మూలాలు బలహీన పడిపోతాయి.
జుట్టు రాలే సమస్యను  తగ్గించుకునే మార్గాలు తెలుసుకుందాం.

read more : hair loss: బట్టతల రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!!(పార్ట్ -1)

మంచి పోషకాహారం తీసుకుంటూ,శరీరానికి కావలసిన నీటిని తాగాలి.ఎప్పటికప్పుడు జుట్టు పెరుగుదలను పరిశీలించుకుంటూ ఉండాలి. కెరాటిన్‌ అనే ప్రోటీన్‌ నుంచి జుట్టు తయారవుతుంది. అందువల్ల తీసుకునే ఆహారంలో సరిపడినంత  ప్రోటీన్‌ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. తక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి . లేదంటే  జుట్టు ఊడుతుంది . బాదం, పాలక్‌ సూప్‌, అక్రోట్లను, పన్నీర్‌, పాలు జట్టు పెరుగడానికి బాగా ఉపయోగ పడతాయి . గ్రీన్‌ టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.


Share

Related posts

నాగ చైతన్య కి వాటి మీద ఆసక్తి ఎక్కువవవుతోందా ..?

GRK

Chandarababu : చంద్ర‌బాబు అలా చ‌నిపోయారు… ఎవ‌రీ సంచ‌ల‌న కామెంట్లు చేశారంటే…

sridhar

Raashi Khanna stunning stills

Gallery Desk