పొట్ట తగ్గడానికి రెండే మార్గాలు. సరైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం. ఆహారంలో ఏ పదార్ధాలు తీసుకుంటే పొట్ట తగ్గుతుందో తెలుసుకోవడం సగమైతే, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం రెండో పని. మీరు ఏ ఎక్సర్సైజెస్ చేస్తారన్నదాని కంటే ఎంత రెగ్యులర్గా చేస్తారు అనేదే ఎక్కువ ఇంపార్టెంట్. అలాగే, కొన్ని ఆహార పదార్ధాలు నిజంగానే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి పనికొస్తాయి. వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యని అధిగమించవచ్చు.
ఈ రోజుల్లో నూటికి 80 శాతం మందికి పొట్ట తగ్గడం, బరువు తగ్గడం అన్నవి పెద్ద సమస్యలవుతున్నాయి. ఐతే, ఫైబర్, ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం మన బరువు తగ్గించగలదు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వును కరిగిస్తుంది.ఇది రోజుకి ఒక్క గ్లాస్ మాత్రమే తాగాలి.
ఒక స్టడీ ప్రకారం రోజుకి రెండు గ్లాసుల పుచ్చకాయ జ్యూస్ ఎనిమిది వారాల పాటూ తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగినట్టు తెలుస్తోంది. కాస్త గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలపండి. ఆ నీటిని తాగడం వల్ల కూడా ఉదర భాగంలోని కొవ్వు ఈజీగా తొలిగిపోతుంది. అంతే కాదు రోజూ కొద్దిపాటి తేనేను మీరు తీసుకునే కొన్ని రకాల పానీయాల్లో చక్కెరకు బదులుగా తేనె కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. దీని ద్వారా మీరు ఈజీగా బరువు తగ్గుతారు. టొమాటో జ్యూస్ కూడా శరీరంలోని కొవ్వుని తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి . కొద్దిపాటి టమాటాల జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటే మీరు కచ్చితంగా బరువు తగ్గుతారు.బత్తాయి రసంను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది .