Sweet Potato : సాధారణంగా సీజన్లలో లభించే చిలగడదుంపలు ఎంతోమంది ఇష్టపడుతుంటారు. తినడానికి ఎంతో రుచి కలిగివుండే ఈ దుంపలు ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో లభించే పోషకాలు మన శరీరంలో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయనీ నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిలకడదుంపలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఎంతో రుచి కలిగిన ఈ చిలగడ దుంపలను ఉడికించి తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి కొంతమంది వీటిని పచ్చిగా తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. అయితే చిలకడ దుంపలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా దుంపల జాతికి చెందిన వాటిలో చిలగడదుంపలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్, ఐరన్, ఫైబర్ మన శరీరానికి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో లభించే టటువంటి విటమిన్ ఎ మన శరీరానికి అందడం వల్ల దృష్టిలోపం సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా రేచీకటి సమస్య బారిన పడకుండా చిలగడదుంపలు మనకు రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ దుంపలు కీలక పాత్ర పోషిస్తాయి.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ ఏ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ లోపం వల్ల పిల్లల ఎదుగుదల లేకపోవడం, చర్మం పొడిబారడం, మొటిమలు రావడం, రేచీకటి వంటి సమస్యల నుంచి ఈ చిలగడదుంపలు రక్షిస్తాయి. అదేవిధంగా పునరుత్పత్తి ప్రక్రియ జరగడానికి కూడా చిలగడదుంపలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటిని తినడం వల్ల వారికి కావలసిన ఐరన్, క్యాల్షియం అందుతాయి. చాలామంది మధుమేహంతో బాధపడే వారు వీటిని తినకూడదని భావిస్తుంటారు. అయితే మధుమేహ సమస్యతో బాధపడేవారికి కూడా చిలగడదుంపలు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇందులో ఉన్న ఫైబర్ మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగు పరిచే మలబద్ధకాన్ని నివారిస్తుంది. చిలగడ దుంపలను తినటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.