Health tips: మారుతున్న కాలంతో పాటు మనుషుల జీవనశైలిలోను, ఆహారపు అలవాట్లలోనూ మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన అహరాన్ని తినడం ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. నోటికి రుచిని ఇచ్చే ఫాస్ట్ ఫుడ్ తినడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు కానీ అది ఎంత వరకు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అనే విషయాల గురించి అసలు ఆలోచించటం లేదు. ఫలితంగా షుగర్, బీపీ, థైరాయిడ్,అధిక బరువు,రక్త హీనత వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కాలంలో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా నీరసం రావడం, ఊరికే అలసటకు లోనవ్వడం,ఆయాసం, గుండె దడ, కాళ్ళు చేతులు చల్లగా మారటం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Health tips: సగ్గుబియ్యం ఉపయోగాలు ఏంటంటే..?
ఎవరిలో అయిన పైన చెప్పిన లక్షణాలు కనిపించినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ బ్లడ్ పెర్సెంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి.కేవలం మందులతో మాత్రమే కాకుండా మనం తినే ఆహారంలో రక్తం పడే ఆహారాన్ని ఎంచుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. అలాంటి ఆహార పదార్ధాలలో సగ్గుబియ్యం కూడా ఒకటి. సగ్గుబియ్యం గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. మన వంట గదిలో నిత్యం సగ్గుబియ్యం ఉంటూనే ఉంటాయి.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రక్తహీనత తగ్గాలంటే సగ్గుబియ్యం తినాలా..?
ఈ సగ్గుబియ్యంలో పొటాషియం,పాస్పరస్,కాల్షియం,ప్రోటీన్స్,కార్బోహైడ్రేట్స్, సోడియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.సగ్గుబియ్యంను ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్త కణాల సంఖ్య పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది.అలాగే సగ్గుబియ్యం శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది.సగ్గుబియ్యాన్ని పాలలో లేదా నీటిలో ఉడికించి బెల్లం లేదంటే పంచదార కలుపుకుని తినవచ్చు.అలాగే సగ్గు బియ్యాన్ని కాసేపు ఉడికించి దానిలో మజ్జిగ,కాస్త ఉప్పు వేసి కూడా తాగితే చలవ చేస్తుంది.
సగ్గుబియ్యం ఎలా తినాలంటే..?
మీకు తెలుసో లేదో సగ్గు బియ్యంతో పునుగులు కూడా వేసుకుని తినవచ్చు. అలాగే సగ్గుబియ్యంతో ఒడియాలు కూడా పట్టుకోవచ్చు. ఇలా ప్రతిరోజు సగ్గుబియ్యం తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.. ఈ వేసవిలో సగ్గుబియ్యాన్ని తీసుకుంటే మరి మంచిది. శరీరంలోని వేడి తగ్గి నీరసం, అలసట తగ్గిపోతాయి.
డయాబెటిస్ ఉన్నవారు కూడా సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు. ఇది రక్తంలో చెక్కర స్థాయిని తగ్గిస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నవారికి నొప్పుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది.ఎలాంటి జీర్ణ సంబంద సమస్యలు ఉన్నా సగ్గుబియ్యం తింటే ఇట్టే తొలగిపోతాయి.ఇవి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తాయి.