చపాతీలు : మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి.ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, స్టోరేజ్ ఫుడ్ తినడానికి ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. మరోపక్క శరీరానికి తగిన వ్యాయామం కూడా లేకపోయే సరికి ఇట్టే బరువు పెరిగిపోతున్నారు. అలాగే కొంతమంది కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా కూడా బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడానికి కారణం ఏదన్నా కానివ్వండి కానీ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి పడే కష్టాలు మాత్రం. అన్ని ఇన్ని కావు అనే చెప్పాలి.అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి చాలా మంది చేసే మొదటి పని ఏంటంటే రాత్రిపూట అన్నం తినడం మానేసి చపాతీలు తినడం.
నిజానికి వైద్యులు కూడా రాత్రి పూట చపాతీ తినమని సలహా ఇస్తున్నారు.మరి రాత్రి పూట చపాతీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి…నిజంగానే చపాతీలను తింటే బరువు తగ్గుతారా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.చపాతీలను గోధుమపిండితో తయారు చేస్తారు. గోధుమ పిండిలో విటమిన్ బి, విటమిన్ ఇ లతోపాటు కాల్షియం, ఐరన్, జింక్, సోడియం, పొటాషియం,మెగ్నిషియం వంటి ఎన్నో రకాల విటమిన్స్,మినరల్స్ ఉంటాయి.
బరువు తగ్గడంలో చపాతీల పాత్ర :
అన్నం తినడం వల్ల ఎంత శక్తి వస్తుందో చపాతీలు తిన్నా కూడా అంతే శక్తి వస్తుంది. నిజానికి అన్నం కంటే చపాతీ తింటేనే త్వరగా జీర్ణమవుతుంది. అలాగే చపాతీలను నూనె లేకుండా కాల్చుకుని తింటే ఇంకా మంచిది.అలాగే చపాతీలు తినగానే మనకు కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. తద్వారా మనం బరువు సులువుగా తగ్గవచ్చు. చపాతీలను రోజు సాయంత్రం 7 గంటల లోపు తినాలి. చపాతీలను తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. రాత్రిపూట చపాతీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…