హెల్త్

ఈ పండ్లు తింటే యవ్వనం మీ సొంతం..!

Share

మారుతున్న కాలంతో పాటుగా తినే తిండి విషయంలో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఫలితంగా లేని పోని అనారోగ్యల బారిన పడుతున్నాము.వయసు పెరిగిన తర్వాత రావలిసిన అనారోగ్యలు, తెల్ల జుట్టు, ముఖంపై ముడతలు చిన్న వయసులోనే వస్తున్నాయి. చాలా మంది వయసు పైబడకుండానే వృద్ధాప్య ఛాయలు సమస్యలతో బాధపడుతున్నారు. మరి అలాంటి వారి కోసం మేము చెప్పే ఈ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ముఖంపై కనిపించే ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు.ముఖ్యంగా మీ రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పండ్లని చేర్చడం ద్వారా ముఖంపై ముడతలని నివారించవచ్చు. మరి ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం

అవోకాడో:

ఆవకాడో తింటే ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ బి, విటమిన్ ఈ మీ యొక్క చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అవకాడో తినడం వలన వృద్ధాప్య ప్రక్రియ మందగించి ముఖంపై ముడతలు రావు అలాగే ఉన్న ముడతలు కూడా తొలగిపోతాయి.

బొప్పాయి:

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో అందాన్ని. కాపాడంలో కూడా అంతే మేలు. చేస్తుంది. బొప్పాయి పండుతో చాలా రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులు తయారవుతాయి. బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మాన్ని దెబ్బతినకుండా చేస్తాయి.

బెర్రీలు :

బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో అనేక రకాల ఫ్లేవనాయిడ్స్‌, యాంటీఆక్సిడెంట్లు,విటమిన్ సి కూడా ఈ పండ్లలో లభిస్థాయి. ఇది కొల్లాజెన్‌ను బలపరిచి చర్మంపై ముడతలు రాకుండా చెస్తాయి.


Share

Related posts

ఏ చేప పడితే ఆ చేప తినకండి .. ఆరోగ్యానికి ఇవే మంచివి

Kumar

Curry Leaves: బిర్యానీ ఆకు – కరివేపాకు రెండిట్లో ఏది బెస్ట్.!?

bharani jella

Fenugreek Oil: మెంతుల నూనె ఆరోగ్యానికి, అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే..!?

bharani jella