పిల్లలు సోషల్ మీడియా బానిసలు గా మారకుండా ఉండాలంటే??

నేటి కాలం లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు  సోషల్ మీడియా లోనే ఎక్కువసేపు బ్రతికేస్తున్నారు.పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు తమ సంతోషాన్ని, బాధను సోషల్ మీడియా ద్వారా ఇతరుల కు తెలియచేస్తూ వారితో పంచుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాని వాడడం వలన ఎన్ని ప్రయోజనలు ఉన్నాయో, అన్నినష్టాలు కూడా ఉన్నాయన్న మాట కూడా నిజం అని ఒప్పుకోవాలిసిన పరిస్థితి. అయితే, సోషల్ మీడియావాడడానికి  ఏ  వయ్యస్సు సరయినది? తమ పిల్లలను తల్లిదండ్రులు సోషల్ మీడియా లో ఏ వయస్సు లో అనుమతి ఇవ్వాలి? అనే ప్రశ్న పై ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది.

పిల్లలు సోషల్ మీడియా బానిసలు గా మారకుండా ఉండాలంటే??

ఈ ప్రశ్నకు అనేక మంది నుంచి రకరకాలు సమాధానాలువినిపిస్తున్నాయి. కొంతమంది 8 సంవత్సరముల వయస్సులో ఉన్న పిల్లలు సోషల్ మీడియా లో కి రావచ్చని వాదిస్తుండగా, మరి కొందరు 15 ఏళ్ళ వయసు వచ్చే వరకు సోషల్ మీడియా లోకి  అనుమతి ఇవ్వకూడదనిఅభిప్రాయపడుతున్నారు. అయితే, పిల్లలు  చాలా మంది 15 ఏళ్ల వయసు లో పే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ఇతర సోషల్ మీడియా లలో యాక్టివ్ గా ఉంటూ వాటికి బానిసలూ అవుతున్నారని అనేక అధ్యయనాల్లో బయటపండింది. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత దృష్టి లో పెట్టుకుని వారి సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి.ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాస్ ల కోసం తల్లిదండ్రులు ఇంటర్నెట్ కనెక్షన్తీసుకోకతప్పడం లేదు.

ఇదే అదనుగా, పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి మొబైల్ ఫోన్ల ను తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లలో రహస్యం గా అకౌంట్ల నుతయారు చేసేసుకుంటున్నారు. తర్వాత వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చురుకుగా ఉంటూ దానికి చాల తక్కువ సమయం లో నే బానిసలుగా మారుతున్నారు. చాలా మంది పిల్లలు తాము సోషల్ మీడియా వాడుతున్నట్లు తల్లిదండ్రుల కు తెలియకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానానంతో అనేకఎత్తులను ప్రయోగిస్తున్నారు.ఈ విధం గా పిల్లలు తమ తల్లిదండ్రుల ను సులభం గా మోసం చేసేస్తున్నారు. ఇలాంటివి నివారించాలంటే మీ పిల్లల కి సరైన వయస్సు లోనే స్మార్ట్‌ఫోన్ ఇవ్వడంమంచిది .

ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో మీ పిల్లలను సోషల్ మీడియా సైట్‌లనువాడడానికి అనుమతించినప్పటికీ వారు ఫోన్ల లో ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూనే ఉండాలి.సోషల్ మీడియా లో అన్ని వయసు ల వ్యక్తులు ఉంటారు. అంతేకాక, అన్ని రకాల సమాచారం అక్కడ ఉంటుంది. అందువల్ల మీ పిల్లలకు కొంత పరికపక్వత వచ్చా కే సోషల్ మీడియా యాక్సెస్ కు అనుమతించడం సరైనది. 13 ఏళ్ల వయసు లో మీ పిల్లలను సోషల్ మీడియా కి తీసుకురావడం మంచిది.

అలా తీసుకువచ్చినా కూడా  పిల్లల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచడం మాత్రం మరువకండి. సాధారణం గా ఈ వయసు లో పిల్లలు తమకు మొబైల్ ఫోన్ కొనివ్వాల ని తల్లిదండ్రుల ను వేదిస్తూ ఉంటారు. అయితే, ఈ వయస్సులో వాటిని నియంత్రించడం అనేది కష్టమైన పని.అటువంటి పరిస్థితి ని నివారించడానికి మీరు వారికి సోషల్ మీడియా యాక్సెస్ కల్పిస్తూనే వారి కార్యకలాపాలపై నిఘా పెట్టడం ఒక్కటే వారిని కాపాడగలిగే మార్గం అని చెప్పాలి

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.