ఈ కంప్యూటర్ కాలంలో ప్రతిఒక్కరు ఆహారపు అలవాట్లలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు చాల జాగ్రత్తలు తీసుకున్న నిరుత్సహం చెందే సమస్య ఏదైనా ఉందంటే అది బరువు సమస్యే. సగటు మనిషి ఉండాల్సిన బరువుకంటే ఎక్కువ ఉన్న కష్టమే, తక్కువ ఉన్న కష్టమే. అందుకే అది నియంత్రణలో పెట్టుకోవడానికి యోగ సెంటర్లకు, వ్యాయమశాలలకు వెళ్తుంటారు. కొందరు బరువు తగ్గిన మళ్ళీ ఆహారాలు లోపల వల్ల బరువు పెరిగి దిగులు చెందుతున్నారు. తగ్గిన బరువును నియంత్రణలో పెట్టుకోవడానికి ఈ చిట్కాలు అవవాటు చేసుకోండి.
కొందరు బరువు తగ్గిన తరువాత నిర్లక్ష్యంతో వ్యాయామం చేయడం, శరీరాన్ని శ్రమ పెట్టడం తగ్గిస్తారు. దాని వల్ల మీ శరీరంలో క్యాలరీల విలువలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గడానికి చేసిన శ్రమలో కొంత సమయాన్ని నిత్యం కేటాయించండి. భారతీయ ఆహారపు అలవాట్లలో కార్బోహైడ్రేట్ల శాతం చాలా ఎక్కువ. కొందరికి తిన్న స్వీట్ పదార్థాలు వైపు మనసు మళ్లుతుంది. వెంటనే కనపడ్డ స్వీట్లను లాగిస్తుంటారు. ఒక్కసారి బరువు తగ్గిన తరువాత ఇలాంటి పని చేశారో మీ శరీరం మళ్ళీ యద స్థానానికి వస్తుంది. మీకు స్వీట్లు తినాలనిపిస్తే బెల్లం తినండి అది అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కొందరు ఆహారం తీసుకునే సమయాలలో భారీ మార్పులు చేస్తారు. అల చేయకండి దానివల్ల ఆరోగ్య సమస్యలతో పాటు బరువుకూడా పెరిగిపోతారు. బరువు విషయంలో మనం త్రాగే నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహాం ఏమి లేదు. మనిషికి రోగాలు రావాలన్న, వచ్చిన రోగాలు పోవాలన్నా తాగే నీరే కారణం. రోజుకి సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉండడమే కాకుండా చర్మంతో పాటు పలు అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. బరువు పెరుగుదల నియంత్రణ ఉండాలంటే కార్బోహైడ్రేట్ పదార్థాలు తినడం తగ్గించి పీచు, ప్రోటీన్ ఉన్న పండ్లు కూరగాయలు తృణ ధన్యాలు ఎక్కువగా తీసుకోండి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండడమే కాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.