NewsOrbit
హెల్త్

ఎప్పుడూ అలసటగా ఉంటోందా?

 

ఎప్పుడు చూసినా అలసిపోయి ఉంటున్నారా. నీరసం తగ్గడం లేదా. ఈ పరిస్థితికి మీరు చక్కదిద్దగలిగిన కొన్ని కారణాలు ఉండొచ్చు. అవేంటో చూద్దాం.

నిద్ర సరిపోకపోవడం

నిద్ర తగినంత లేకపోతే అలసట వస్తుంది. రోజూ రాత్రిపూట ఏడెనిమిది గంటలు నిద్రించండి. ఒకే టైముకి నిద్రపోవడం, ఒకే టైముకి లేవడం చేయండి. పక్క చక్కగా ఉందో లేదో చూసుకోండి. పడకగది తగనంత చీకటిగా చల్లగా ఉండేట్లు చూడండి. టివి, సెల్‌ఫోన్ ఆపేయండి. అప్పటికీ సరిగా నిద్ర పట్టకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లండి.

స్లీప్ ఆప్నియా

నిద్రలో మనకు తెలియకుండానే కాస్సేపు ఊపిరి ఆగిపోవడాన్ని స్లీప్ ఆప్నియా అంటారు. చాలామందికి తమకు ఈ రకంగా జరుగుతుందని కూడా తెలియదు. దీనివల్ల పెద్ద గురక వస్తుంది. పగటిపూట అలసటగా ఉంటుంది.

స్థూలకాయం, పొగతాగడం, మద్యం సేవించడం వల్ల ఇది ఎక్కువ కావచ్చు. కాబట్టి వళ్లు తగ్గించి, పొగ, మద్యం అలవాట్లు ఉంటే వాటిని మానేయాలి. సరిగా శ్వాసించేందుకు సహాయపడే యంత్రాన్ని డాక్టర్ సలహాతో వాడవచ్చు.

ఆహారం అలవాట్లు

ఏమి తింటున్నదీ, లేక ఏమి తినకుండా ఉంటున్నదీ మన నిద్రను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తగినంత ఆహారం తినకపోవడం, లేక పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అలసట రావచ్చు. రక్తంలో చక్కెర శాతం పెంచే ఆహారం తీసుకుంటే ఆ శాతం తగ్గగానే అలసట రావచ్చు. ఈ సమస్యల నుండి తప్పించుకోవడానికి సమీకృతాహారం తీసుకోవాలి.

రక్త హీనత

ఇనుము తగ్గడం వల్ల వచ్చే ఈ పరిస్థితి కారణంగా మహిళలకు అలసట రావచ్చు. బహిష్టు స్రావం ఎక్కువగా ఉండేవారు, గర్భంతో ఉన్నవారు ఈ కారణాన మరింత అలసటకు గురవుతారు. ఇనుము ఎక్కువ ఉన్న మాంసం, గోంగూర, బీన్స్, బంగాళదుంప, బ్రోకోలి, నట్స్, ముడిబియ్యం ఎక్కువగా తినాలి. సప్లిమెంట్స్ కావాలంటే డాక్డర్‌ను సంప్రదించాలి.

కెఫిన్ మోతాదు ఎక్కువ కావడం

కాఫీ, టీ, కోలా వంటి కెఫిన్ పానీయాలు హుషారు నిస్తాయి అయితే అవి ఎక్కువయితే గుండె వేగం పెరగడం, గుండె దడదడలాడడం, రక్తపోటు హెచ్చడం, నిద్రలేమి  వంటి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ అలసటకు దారి తీస్తాయి. కాబట్టి ఎక్కువ కెఫిన్ శరీరంలోకి వెళ్లకుండా చూసుకోవాలి.

డీహైడ్రేషన్

శరీరంలోకి తగినంత నీరు వెళ్లకపోతే డీహైడ్రేషన్ వస్తుందని మనకందరికీ తెలుసు. దీని వల్ల కూడా అసలట వస్తుంది. నీళ్లు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు దాహం వేస్తేనే నీరు తీసుకోవాలన్న నియమం కూడదు. మీకు దాహం వేసేసరికే శరీరం డీహైడ్రేషన్‌కు లోనయిఉండొచ్చు. అందుకని క్రమం తప్పకుండా నీరు తాగాలి.  రోజుకు ఎనిమిది గ్లాసులు తాగాలని చెబుతారు. మీరు ఉన్న ప్రాంతం బట్టి, మీరు చేసే పనిని బట్టి మీకు ఎక్కువ నీరు అవసరం కావచ్చు.

షిఫ్ట్‌లో పని చేయడం

కొన్ని ఉద్యోగాలు షిఫ్ట్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ మారినపుడు నిద్ర విషయంలో శరీరం ఇబ్బందికి లోనవుతుంది. పగలు నిద్రపోవాల్సి వస్తే గదిని వీలైనంత చీకటిగా చల్లగా ఉంచుకోవాలి. రాత్రి పూట పని చేయాల్సివస్తే అక్కడ బాగా కాంతివతంగా ఉండేట్లు చూడాలి. కెఫిన్ పానీయాలకు దూరంగా  ఉండాలి.

ఫుడ్  అలెర్జీ

కొన్ని రకాల ఆహార పదార్ధాలు పడకపోవడం వల్ల కూడా అలసట వస్తుంది. ఏదైనా ఆహారం తిన్న తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే అది మీకు పడని ఆహరం అయిఉండొచ్చు. ఆ ఆహారాన్ని ఒకటికి రెండు సార్లు తినడం మానడం చేసి పరిశీలిస్తే విషయం తేలిపోతుంది.

కొంత మందికి ఎలాంటి కారణం లేకుండానే అలసటగా ఉంటుంది. వారు సమీకృత ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడంతో పాటుగా వ్యాయామం చేసినందువల్ల ఫలితం ఉండొవచ్చు.

ఇక మీకు మీరుగా చక్కదిద్దుకోలేని కారణాలు కొన్ని ఉన్నాయి. హైపోధైరాయిడిజం, గుండె జబ్బు, మధుమేహం, డిప్రెషన్ వంటివి ఈ  కోవలోకి వస్తాయి. వీటికి సరైన వైద్య చికిత్స తప్పనిసరి.

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment