Salt: బ్లాక్ సాల్ట్ ను మన పెద్దవాళ్ళ కాలం లో ఆయుర్వేద మందులు తయారుచేయడానికి దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు దీన్ని ఆయుర్వేదం తో పాటు ఇళ్లలో కూడా వాడుకుంటున్నారు. పేరుకు ఇది బ్లాక్ సాల్ట్ అయినా నల్లగా ఉండకుండా … గోధుమ,గులాబీ రంగుల్లో ఉంటుంది.పూర్వం మూలికలు, గింజలు, సుగంధ ద్రవ్యాల్ని బ్లాక్ సాల్ట్‌లో కలిపి వేడి చేసేవారు. ఇది చాలా శ్రేష్టమైనది గా చెప్పబడింది. ఇక ఇప్పుడు అయితే బ్లాక్ సాల్ట్‌ని కృత్రిమంగా కూడా తయారు చేసి అందిస్తున్నారు. మనం రెగ్యులర్‌గా వాడే సాల్ట్, బాగా ప్రాసెస్ చేసి, చాలా వరకు మినరల్స్‌ని తొలగించి అమ్మేస్తున్నారు . అందువల్ల దానితో ఆరోగ్యానికి జరిగే మంచి అనేది ఏమీ లేదు. ఆయుర్వేద బ్లాక్ సాల్ట్ ప్యాకెట్ కొనుక్కోవడం అన్నివిధాలా మంచిది.
మామూలు సాల్ట్ కంటే కూడా బ్లాక్ సాల్ట్ వాడటం మంచిది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు,డాక్టర్లు. దీనికి కారణం బ్లాక్ సాల్ట్‌లో సోడియం తక్కువగా ఉండడమే. హైబీపీ ఉన్నవారు బ్లాక్ సాల్ట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది . బ్లాక్ సాల్ట్ ప్యాకెట్ కొనాలనుకున్న పుడు ఇందులో సోడియం ఎంత శాతం ఉందో చూసుకోవాలి. కొన్ని రకాల బ్లాక్ సాల్ట్‌లలో సోడియం ఎక్కువశాతం ఉంటుంది. కొన్ని సార్లు మామూలుగా మనం వాడే సాల్ట్ లలో ప్రమాదకర పొటాషియం అయోడైడ్, అల్యూమినియం సిలికేట్ వంటివి ఉంటాయి. సంప్రదాయ బ్లాక్ సాల్ట్ ఎక్కువ ప్రాసెసింగ్ చేయకుండా ఇతర పదార్థాలు కలపకుండా ఉంచుతారు. మామూలు సాల్ట్ లో యాంటీ-కేకింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు .
బ్లాక్ సాల్ట్‌లో అయితే అవి ఉండవు. మాములు సాల్ట్‌లో అయోడిన్ ఉంటుంది. ఇది శరీరంలో అయోడిన్ సరిపడా లేని వారికి మేలు చేస్తుంది అని చెప్పాలి. అదే సమయంలో… హిమాలయా బ్లాక్ సాల్ట్‌లో ఖనిజాలు పుష్కలం గా ఉంటాయి. అది జీర్ణక్రియను ఇంప్రూవ్ చేస్తాయి. పొట్టలో వచ్చే గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి.దీనితో పాటు చర్మం, జుట్టుకు మంచిది అని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. అందువల్ల రెండు రకాల ఉప్పులు మంచివే .. అయితే ఒక్కో రోజు ఒక్కోటి వాడడం వలన రెండింటి ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్లాక్ సాల్ట్ సింథటిక్ తరహా లో ఉన్నది కాకుండా ఒరిజినల్‌గా ప్రకృతి నుంచీ వచ్చేది ఉపయోగించడం మంచిది. ఏది ఏమైనా కూడా సాల్ట్ అనేది మనం ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకు ఒక వ్యక్తి 2300 మిల్లీ గ్రాములు అంటే ఓ టేబుల్ స్పూన్ మాత్రమే వాడేలా జాగ్రత్త పడాలి.