మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే ఈ రోజుల్లో చాలామంది టక్కున పలానా గ్రూప్ అని చెప్పగలుగుతున్నారు.. ఇప్పటివరకు బ్లడ్ గ్రూప్స్ అంటే ఏ , బీ , ఏబీ, ఓ అని.. అందులో పాజిటివ్, నెగిటివ్ అనే రెండు రకాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే.. తాజాగా గుజరాత్ డాక్టర్స్ బ్లడ్ గ్రూప్ ను కనుగొన్నారు వినడానికి ఇది ఆశ్చర్యంగానే ఉన్నా కానీ.. నిజమే.. ఇంతకీ అది ఏ బ్లడ్ గ్రూప్..!? ప్రపంచంలో ఎంతమందికి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..!
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోటకు చెందిన 65 ఏళ్ల ఓ వ్యక్తికి హార్ట్ డిసీజ్ ఉంది.. అందుకు సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు అట్ ట్రీట్మెంట్ కోసం పలు రకాల టెస్టులు చేశారో అందులో ఇతని బ్లడ్ గ్రూప్ ఏంటి అని టెస్ట్ చేయగా ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈయనది అందరిలా సాధారణమైన బ్లడ్ గ్రూప్ కాదు ప్రపంచంలోనే రేర్ బ్లడ్ గ్రూప్ అసలు ఇప్పటివరకు ఇలాంటి బ్లడ్ గ్రూప్ కలిగిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు అంటే మీరు నమ్ముతారా.. ఇప్పుడు ఇతనితో కలిపి మొత్తం పదిమంది అవుతారు.. ఇతనికి “ఈఎంఎం నెగిటివ్” అనే బ్లడ్ గ్రూప్ ఉంది.. దీనిని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ ఈఎంఎం నెగిటివ్ అని పేరు పెట్టింది..
ఈఎంఎం నెగిటివ్ ఈ బ్లడ్ గ్రూప్ మనుషుల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేదు. ఎవరి నుండి పొందలేరు అని వైద్యులు చెప్పారు..