Alcohol : అతిగా మద్యం తీసుకోవడం వలన కాలేయం దెబ్బ తింటుంది అన్న విషయం తెలిసిందే. కాలేయం దెబ్బ ఇదొక్కటే కారణం కాదు కాదు. ఇంక చాలా రకాల ఆహారాలు కారణం అవుతాయి. వాటిగురించి తెలుసుకుందాం.
పంచదార : స్వీట్స్ , చాక్లెట్ల వంటివి అధికం గా తినకుండా జాగ్రత్తగా ఉండండి. శుద్ధిచేసిన చక్కెరలను మోతాదుకు మించి తింటే, కాలేయం జబ్బు వస్తుంది. శరీరం తీసుకోకుండా మిగిలిపోయిన కేలరీలు ఏవైనా కూడా కాలేయంలో కొవ్వురూపంలో పేరుకుపో యి కాలేయం కొవ్వు పట్టటానికి కారణం అవుతుంది.
రుచికరంగా ఉండటానికి : ప్రస్తుతం రుచికరంగా ఉండటానికి చాలా పదార్థాల్లో మోనోసోడియం గ్లుటమేట్ కలుపుతున్నారు. ఇది కాలేయంలో వాపు కారణం అవుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో బయట పడింది.
విటమిన్ ఏ: కంటి ఆరోగ్యానికి, స్పష్టమైన చూపుకు విటమిన్ ఏ బాగా తోడ్పడుతుంది. కానీ దీన్ని అవసరమైన దాని కన్నా ఎక్కువగా తింటే మాత్రం కాలేయానికి హాని తప్పదు.
డైట్ కూల్ డ్రింక్స్ : చక్కెర లేని డైట్ కూల్ డ్రింక్స్ లో కూడా కృత్రిమ తీపి పదార్థాలతో పాటు కార్బన్ డయాక్సైడ్ కూడాఎక్కువగా ఉంటుంది. కాబట్టి కూల్‌డ్రింకులను అదేపనిగా తాగుతుండడన వలన కూడా కాలేయ జబ్బులు వస్తాయి.
డిప్రెషన్ మందులు: డిప్రెషన్ మందులు కాలేయంలో విషతుల్యాల మోతాదులు పెరగటానికి సహాయపడతాయి. అందువల్ల వీటిని వేసుకునేవారు కాలేయ జబ్బు లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సూచనలు సలహాలు పాటించాలి.
ఉప్పు ఒక కారణం : అధిక రక్తపోటుకు ఉప్పుతో సంబంధం ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే దీనివలన కాలేయ జబ్బు కూడా వస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వలన శరీరంలో ద్రవాల మోతాదులు పెరిగి ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది.
ప్యాకేజ్డ్ ఫుడ్: చిప్స్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ లో ఉప్పుతో పాటు ట్రాన్స్‌ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా కాలేయం దెబ్బతినటానికి తమ వంతు సాయం చేస్తాయి.