తల్లి కావడం అనేది ప్రతి స్త్రీ కి ఒకవరం లాంటిది .గర్భం పొందడం, బిడ్డకు జన్మనివ్వడం, అమ్మ అనిపించుకోవడంలో ఉన్న మాదుర్యం, అనందం మాటల్లో చెప్పలేనంత. గర్భం ధరించగానే తన గురించి కంటే తన కడుపులోని బిడ్డ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. తనకు పుట్టబోయే బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనుకుంటుంది. ఇది ప్రతి మహిళకు సహజంగా ఏర్పడే భావన.
అప్పటివరకు ఎలా ఉన్న గర్భం దాల్చాలి అని అనుకుంటే.. ముందుగా కొన్ని నియమాలని పాటించాలి. తమ జీవన విధానము లో లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే ఆరోగ్యవంతమైన బిడ్డ కోసం గర్భం రాకముందే శరీరాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలి .జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం మొదలుపెట్టాలి. అంతే కాదు, మహిళలు మద్యం, ధూమపానం మానుకోవాలి.ఎందుకంటే ఈ రెండూ సంతానోత్పత్తిని మరియు పుట్టబోయే పిల్లల శారీరక స్థితిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, గర్భం రావడానికి ముందే అనుసరించవలిసిన విధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గడం.. కొన్ని కారణాల వల్ల కొందరు మహిళలు సులభంగా బరువు పెరిగిపోతారు. అలా బరువు పెరగడం వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా అధిక బరువు ను తగ్గించుకుని మీ శరీరాన్ని గర్బధారణకు అనువుగా మార్చుకోవాలి..కాఫీ తాగడం ఆపేయాలి..ఏంటి ఆలా చూస్తున్నారు … మీరు చదివింది నిజమే,పిల్లలు కావాలి అనుకుంటే.. మీరు కాఫీ తాగే అలవాటుని మార్చుకోవాలి. కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ గర్భం దాల్చినా.. ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంది….. రక్త పోటు చాలా ప్రమాదకరం. చాలా మంది అనవసర టెన్షన్లతో హై బీపీ తెచ్చుకుంటారు. దీని వల్ల లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. వీలైనంత ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. బీపీ తెచ్చుకునే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి.డైట్ ఫాలో అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకున్నారో తెలీదు కానీ.. బిడ్డ కావాలి అనుకున్నప్పటి నుంచి మంచి డైట్ ఫాలో ఆవలిసిందే . అందులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన పానీయాలు అంటే ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవించాలి.ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.
అందుకే సీ విటమిన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. మంచి నీరు ఎక్కువగా తాగాలి. వేపుడు పదార్థాలు కూడా తినకపోవడం మంచిది.గర్భదారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఉత్తమం. ఇది అబార్షన్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి.. ముందు నుంచే ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలి. పాలు, గుడ్లు కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.