Adopt: పిల్లల్ని దత్తత తీసుకోవాలి అనుకునే ప్రతీ ఒక్కరూ ‘ఈ పాయింట్ ‘ కంపల్సరీ తెలుసుకోవాలి , తరవాత బాధపడకుండా !

Share

Adopt: దత్తత తో  పిల్లలు  లేని తమకు ఒక బిడ్డ  దక్కడం తో  తో పాటు,   ఒక అనాధ బిడ్డకు   ఒక కుటుంబం ఏర్పడుతుంది అన్న   ఆశతో దత్తత తీసుకునే వారి సంఖ్య  రోజు రోజుకి   పెరుగుతూనే ఉంది. చాలామందికి దత్తత   ఎలా తీసుకోవాలి అన్నది తెలియదు.  గుట్టుచప్పుడు కాకుండా   రహస్య ఒప్పందం  చేసుకుని  పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు.నిజానికి  ఇది చట్ట ప్రకారం నేరం. అలా  దత్తత తీసుకుంటే ఎప్పటికైనా చిక్కుల్లో పడతారు.
 కొన్ని రోజులుగా అనాధ పిల్లల దత్తత ప్రోత్సహిస్తూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రచారానికి ప్రాధాన్యత కూడా ఇస్తున్నాయి. పిల్లల దత్తత కోసం  ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొన్ని విషయాలు గురించి తెలుసుకోవాలి  తీసుకున్న దత్తత వల్ల మాత్రమే  బిడ్డ తల్లిదండ్రులు గా  అధికారికంగా నమోదు  చేసుకునేందుకు వీలుంటుంది. స్కూల్ లో  చేర్పించాలి అని  అన్న  , బర్త్ సర్టిఫికెట్ కావాలంటే… చట్టప్రకారం దత్తతు నమోదు చేయాల్సి ఉంటుంది. నోటి మాటగా చేసుకునే దత్తతు వల్ల భవిష్యత్తులో అనేక చట్టపరమైన, న్యాయ పరమైన సమస్యలు  ఎదుర్కోవలసి ఉంటుంది.అలాగే ఆడపిల్లను  దత్తత తీసుకునేటప్పుడు ఉండే నియమాలు, మగ పిల్లాడిని   దత్తత తీసుకునే ముందు పాటించాల్సిన నిబంధనలు ఒకేలా ఉండవు. దత్తత చేసుకోవాలనుకున్నప్పుడు  దంపతులిద్దరూ మేజర్లు అయి ఉండాలి .  పిల్లలను దత్తత చేసుకోవాలనుకున్నప్పుడు   భార్య అనుతి  కచ్చితం ఉండి తీరాలి.
ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న వ్యక్తి కనుక  ఎవరినైనా  దత్తత తీసుకోవాలి అని అనుకుంటే భార్యలందరి దగ్గర   అనుమతి  పొందవలిసి ఉంటుంది. ఒకవేళ భార్య చనిపోయిన వ్యక్తి లేదా బ్రహ్మచారి గా ఉన్న వ్యక్తి … ఎవరినైనా దత్తతు తీసుకోవాలనుకుంటే,అతని మానసిక స్థితి సరిగా  ఉంది అనే  సర్టిఫికెట్  సమర్పించాల్సి  ఉంటుంది.ఒంటరి  స్త్రీలు అయితే   తమ ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ సర్టిఫికెట్ సమర్పించాలి .         అనాధాశ్రమం నుంచి   పిల్లలను దత్తత   కు తీసుకోవాలి అంటే అది చట్టప్రకారం గుర్తింపు పొందినది గా ఉండాలి . న్యాయ స్థానం యొక్క అనుమతి  తో నే    పిల్లలను దత్తత తీసుకోవడం     ముఖ్యం . 15 ఏళ్లు నిండిన పిల్లల ను మాత్రమే దత్తత తీసుకోవడానికి  అవకాశం  ఉంటుంది .బాబును  దత్తత తీసుకోవాలంటే, ఆ దంపతులకు మగ పిల్లలు లేకుండా ఉండాలి.  దత్తతుకు ప్రధాన అర్హులు   అసలు పిల్లలు లేనివారు   అని చెప్పక తప్పదు.  ఆడపిల్ల  ని దత్తత  తీసుకోవాలంటే ,   వారికీ అసలు కూతురు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అర్హులు. అలాగే దత్తత   కి వచ్చే పాప  వయసు కంటే, దత్తత స్వీకరించాలనుకునే తండ్రి వయసు కనీసం 21 సంవత్సరాలు ఎక్కువ గా  ఉండాలి.అనాథ పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే దంపతులు, ముందుగా స్త్రీ- శిశు సంక్షేమశాఖ వెబ్‌సైట్లో లాగిన్ కావలి . తర్వాత పాన్‌కార్డు నెంబర్ ద్వారా దత్తతకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
దత్తతు చేసుకోవాలనుకునే వాళ్ళు కచ్చితంగా రెసిడెన్స్ ఫ్రూఫ్ పాన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, దంపతులిద్దరి బర్త్ సర్టిఫికెట్లు,వివాహ నమోదు పత్రం, హెల్త్ సర్టిఫికెట్ ఇవ్వవలసి  ఉంటుంది. వీటితో పాటు కనీసం ఇద్దరు వ్యక్తుల నుంచి సిఫార్సు లేఖలు, వారి ఐడీ కార్డు తో సహా  అప్లై చేయాల్సి ఉంటుంది. భార్యభర్తలిద్దరు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు, ఇద్దరు కలిసి దిగిన పెళ్లి ఫోటోలు కూడా అప్లికేషన్ తో  పాటు  ఇవ్వవలసి ఉంటుంది. వీటితో కొంత సొమ్ము తో తీసిన  డీడీ అప్లికేషన్ ఫారం తో పాటు 40 వేల రూపాయలు దత్తత తీసుకునే సమయంలో సంబంధిత అనాథాశ్రమానికి డీడీ రూపంలో  ఇవ్వవలిసి ఉంటుంది.

Share

Related posts

అబార్షన్ అవ్వడానికి  కారణలు ఇవ్వే ..!

Kumar

ఇలా చేస్తే మ‌ధుమేహాన్ని త్వ‌ర‌గా త‌గ్గించొచ్చు!

Teja

పచ్చి కొబ్బరి ఎందుకోసం బాగా ఉపయోగపడుతుందో  తెలిస్తే ఇక వదిలిపెట్టారు!!

Kumar