కాకరకాయ చేదుగా ఉంటుందనే కానీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.. కాకరకాయ కాదు అందులోని విత్తనాలు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ గింజలు కూడా కాస్త చేదుగా వగరుగా ఉంటాయి.. ఈ గింజలు పారేయకుండా ఈ విధంగా ఉపయోగిస్తే మాత్రం జబ్బులే దరిచెరవు..
కాకరకాయ గింజలలో విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి.. కాకరకాయ గింజలను ఎండబెట్టి దంచి పొడిచేసుకోవాలి.. ఈ పొడిని ప్రతిరోజు చిటికెడు తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకోవాలి.. ఇలా తీసుకోవడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.. మధుమేహాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ గింజల పొడిని తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.
కాకరకాయ గింజలలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది. చర్మం నిత్య యవ్వనంగా కనిపించేటట్టు చేస్తుంది.. ప్రతిరోజు ఈ గింజల పొడిని తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు శరీరంలోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?