ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Citron Fruit: అబ్బ అబ్బ దబ్బ.. నీ గురించి తెలుసుకోకపోతే మాకేగా దెబ్బ..!!

Share

Citron Fruit: నిమ్మజాతి పండ్లలో దబ్బ పండు కూడా ఒకటి.. ఇది తీపి, పులుపు, వగరు రుచులతో కలగలిసి ఉంటుంది.. దబ్బపండు తో పచ్చడి, పులిహోర ఇలా రకరకాల వంటలు తయారు చేసుకుని తింటారు.. ఇది కేవలం రుచినే కాదు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది..!! దబ్బ పండు ఏ ఏ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో చూడండి..!!

Excellent Health Benefits Of Citron Fruit:
Excellent Health Benefits Of Citron Fruit:

దబ్బ పండు లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు దబ్బ పండు రసం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ పండులో ఉండే లైకోపిన్ చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది.

Excellent Health Benefits Of Citron Fruit:
Excellent Health Benefits Of Citron Fruit:

దబ్బకాయ లో పొటాషియం, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇది ఎముకలను, దంతాలను దృడంగా ఉంటుంది. ఇంకా రక్తహీనత ను దూరం చేస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దబ్బకాయ తొక్కలను ఎండబెట్టి వాటిని చప్పరిస్తే దోషాలను తొలగిస్తుంది. ఇంకా కడుపులోని నులిపురుగులను కూడా చంపేస్తుంది. దబ్బకాయ రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే వేసవి తాపాన్ని తగ్గిస్తుంది దగ్గు, జలుబు, ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దబ్బ పండు రసం గుండెకు చక్కని టానిక్లా పని చేస్తుంది. దీని లో ఉండే విటమిన్ పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.


Share

Related posts

IT Rides: సోనూ సూద్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు..

somaraju sharma

Russia Ukraine War: రష్యాలో ధనవంతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన యూఏఈ రాకుమారుడు..!!

sekhar

కరోనా లో మూతపడ్డ థియేటర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ! ఎవరు దీనికి కారకులో చెప్పేసిన నట్టికుమార్ !

Yandamuri