Clove Milk: పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. మరి లవంగం పాలు తాగితే..!? ఏంటి లవంగాలతో పాలు కూడా తయారు చేసుకుని తాగుతారా అని ఆశ్చర్యపోతున్నారా..!? మరి ఆ పాల ప్రయోజనాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తాగుతారు..!? ఇంతకీ లవంగం పాలు ఎలా తయారు చేసుకోవాలో..!? ఎప్పుడు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
ముందుగా 4 లవంగాలు తీసుకొని దంచి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో ఒక గ్లాసు పాలు పోసి అందులో లవంగాల పొడి వేయాలి. ఈ పాలను 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇందులో కొద్దిగా బెల్లం లేదా కలకండ ను వేసుకోవచ్చు. ఈ పాలను ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. అంతే తాగడానికి లవంగం పాలు రెడీ.. పగలు కంటే రాత్రి పూట ఈ పాలను తాగితే మెరుగైన ఫలితాలు కలుగుతాయి.
లవంగం పాలు తాగడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలసట, నీరసం, నిస్సత్తువ ను తొలగిస్తుంది. ఇది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. పంటి నొప్పిని నివారిస్తుంది. అన్ని రకాల దంత సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. మలబద్ధకం బయటపడేస్తుంది. రుచికరమైన ఆహారం ముందు ఉన్నా కానీ.. ఆకలి లేని వారికి ఈ పాలు తాగితే అమితమైన ఆకలి వేస్తుంది. మైగ్రేన్ తల నొప్పిని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.