Jujube Fruit: సీజన్ మారినప్పుడల్లా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. వాటిని అడ్డుకోవాలంటే పోషక ఆహారం తోపాటు ఆ సీజన్ లో లభించే పండ్లు తినడం అంతే ముఖ్యం.. మరి చలికాలంలో లభించే పండ్లలో రేగు పండ్లు ఒకటి.. చిన్న రేగు పళ్ళు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తింటారు..!!

రేగు పళ్ళు కాస్త పుల్లగా, కాస్త తియ్యటి రుచిని అందిస్తాయి. శరీరానికి చక్కటి పోషకాలు అందించాలంటే రేగు పండ్లను కచ్చితంగా తినాల్సిందే.. వీటిలో పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాలు కలిగి ఉంది. ఇవి మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. రక్త హీనత సమస్య నుంచి బయటపడాలంటే వీటిని ఖచ్చితంగా తీసుకోవాలి.

రేగు పండ్లను ఈ సీజన్లో లభించే అన్ని రోజులు తింటే శరీరానికి కావలసినంత రక్త ప్రసరణ జరుగుతుంది. ఇవి తింటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శీతాకాలం లో వచ్చే జలుబు, దగ్గు ను తగ్గిస్తాయి. వీటిలో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు దృఢంగా ఉంచుతుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారు ఈ పండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులు, వాపులను తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయి. క్యాన్సర్ ను నివారించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. నిద్ర లేమీ సమస్యను నివారిస్తుంది. అయితే ఈ పళ్లను మితంగా తీసుకోవాలని గుర్తుంచుకోండి.