Red Ponnaganti: ఆకుకూరల్లో పొన్నగంటి ఆకు కొరకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకుకూర తో చేసిన నా కూరలు తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. పొన్నగంటి ఆకు కూర లో మరొక రకం కూడా ఉంది.. అది ఎర్ర పొన్నగంటి కూర.. దీనిని నాటు పొన్నగంటి కూర అని కూడా పిలుస్తారు.. ఎర్ర పొన్నగంటి ఆకుకూర వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తింటారు..!!

సాధారణ పొన్నగంటి కూర తో పోలిస్తే ఎర్ర పొన్నగంటి కూర లు పోషకాలు అధికంగా లభిస్తాయి. పైగా ఈ ఆకు కూర ఒక్కసారి నాటితే జీవితాంతం అలాగే పెరుగుతుంది. ఎర్ర పొన్నగంటి కూర లో విటమిన్ ఏ, బి 6, సి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లెవిన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలను అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి ఈ ఆకు కూరలు పప్పు, కూర, పచ్చడి గా చేసుకొని తినవచ్చు. ఈ ఆకుకూరను తరచూ తింటూ ఉంటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఈ ఆకుకూర లో క్యాన్సర్ కణాలతో పోరాడే గుణాలను కలిగి ఉంది. ఇంకా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

నాటు పొన్నగంటి కూర లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది ఇది ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు బ్యాక్టీరియా వైరస్ వంటి హానికర క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇందులో కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకల సాంద్రతను పెంపొందిస్తుంది. త్వరగా కీళ్ళ సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్య నుండి మిమ్మల్ని కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.