Vetiver Roots: నేటి ఆధునిక జీవన విధానంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా గాబరా పడడం, ఆందోళన చెందడం, కోపగించుకోవడం వంటివి కూడా అనారోగ్య సమస్యల కిందకే వస్తాయి.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సమస్యలను మనం గమనించవచ్చు. మానసిక ఒత్తిడి వీటన్నింటికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ ఔషధం చాలు.. వట్టి వేరు వడి చూర్ణం ఈ సమస్యలన్నింటినీ సరిచేస్తుంది..

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వట్టి వేరు వడి చూర్ణం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు. కోపాన్ని తగ్గించడమే కాకుండా శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. కూల్ కూల్ గా ఉంచుతుంది. వేడి ఎక్కువగా ఉంటే వచ్చే చర్మ, కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కొందరిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని, ముఖం నల్లగా మారటం వంటివి కనిపిస్తాయి. అలాంటి సమస్యలకు కూడా ఈ వేరు తో చేసిన పొడితో చెక్ పెట్టవచ్చు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వట్టి వేరు వడి చూర్ణం ను మూడు నుంచి ఏడు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు పావు టీ స్పూన్, 7 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు అర చెంచా , 17 సంవత్సరాలు పైబడిన వారు ఒక టీస్పూన్ చొప్పున తీసుకోవాలి. మనం తాగే నీటిలో ఈ పొడిని కలుపుకుని తాగవచ్చు. ఇలా తాగితే శరీరానికి చలువ చేస్తుంది. ఇలా చేయడం వల్ల చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. ఇమ్మ్యూనిటి పవర్ కూడా పెరుగుతుంది.