Stretch Marks: సాధారణంగా పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ మహిళల్లో పిల్లలు పుట్టిన తర్వాత శాశ్వతంగా కనిపిస్తాయి. ఇక కొందరిలో ఉన్నట్టుండి బరువు తగ్గినా, బరువు పెరిగినా కూడా పొట్టపై చారలు కనిపిస్తూ ఉంటాయి.. వీటిని తగ్గించుకోవడం కోసం కాస్మెటిక్ సర్జరీలు సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.. లేదంటే మార్కెట్ లో దొరికే హానికర కాస్మెటిక్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటూ ఉంటారు.. అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ కు శాశ్వతంగా చెక్ పెట్టండి ఈ వంటింటి చిట్కాలతో..!!
నిమ్మకాయ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. మన వంటింట్లో ఉండే నిమ్మకాయ, కీరదోస తో చెక్ పెట్టవచ్చు స్ట్రెచ్ మార్క్స్ కు.. నిమ్మ రసంను కీరదోస గుజ్జు లో కలిపి చారలు ఉన్నచోట రాయాలి. ఇలా ప్రతినిత్యం చేస్తూ ఉంటే పొట్ట పైన ఉన్న చారలు త్వరగా కనుమరుగవుతాయి. ఇక కలబంద మొక్కను తీసుకొని పొట్టపై చారలు ఉన్న చోట రాసుకోవలి. ఒక అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చారలు త్వరగా మాయమవుతాయి.
ఆముదం పూర్వం ఉపయోగించేవారు అయితే పొట్ట పై ఉన్న చారలు తొలగించడంలో ఆముదం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఆముదము ను పొట్టపై చారలు ఉన్న చోట రాస్తూ ఉండాలి. ఇలా కొన్ని రోజులపాటు శ్రద్ధగా చేస్తూ ఉంటే అవి త్వరగా మానిపోతాయి. ఇక ఇటువంటి మచ్చలు లేదా గీతాలు తొలగించడంలో కోకో పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా మేని ఛాయను మెరిపిస్తుంది కూడా. కోకో పౌడర్ లో కొద్దిగా నీళ్ళు కలిపి పొట్టపై రోజు రాత్రి నిద్రపోయే ముందు వ్రాసుకోవాలి ఉదయం లేవగానే కడిగేసుకోవాలి లేదంటే మార్కెట్లో కోకో బటర్ దొరుకుతుంది. అది అయినా సరే రాత్రి నిద్రపోయే ముందు మార్క్స్ ఉన్న చోట రాసుకుని ఉదయం కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు ఓపికగా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ మాయమవ్వటం ఖాయం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?