పరీక్షలు ప్రశాంతం గా రాయాలంటే నిపుణుల సలహా ఏమిటో తెలుసుకోండి !!

పరీక్షలకు  వెళ్ళేటప్పుడు చాలామంది కంగారు పడిపోతూ,బయపడిపోతూ ఉంటారు. అలా కాకుండా ప్రశాంతం గా  వెళ్లి పరీక్ష ఎలా రాయాలని నిపుణులు చెబుతున్నారో తెలుసుకుందాం. పరీక్షల సమయంలో ఎక్కువగా ఆందోళనకు గురిఅవడం వల్ల చదివింది మర్చిపోతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

పరీక్షలు ప్రశాంతం గా రాయాలంటే నిపుణుల సలహా ఏమిటో తెలుసుకోండి !!

కాబట్టి ఆందోళన పడకుండా  రోజూ కాలేజ్, స్కూల్‌కి వెళ్లి నట్టే వెళ్లి పరీక్ష  రాయాలి.కానీ పరీక్షకి వెళ్ళేటప్పుడు వాహనాల మీద పరీక్షా గంట కొట్టే ముందు వరకు హడావుడి గా చదవడం వంటివి అస్సలు చేయకండి అలా చేయడం వలన మొత్తానికే మోసం వస్తుంది. తెలిసినవి కూడా మర్చిపోయే అవకాశం ఉంది.  ఇంకా మంచి నిద్ర ఉంటే మానసికంగా ప్రశాంతం గా ఉంటారు. దీని వల్ల పరీక్షలు బాగా రాయగలుగుతారు, కాబట్టి పరీక్షలయ్యాక బాగా నిద్ర పోదాం అని  అనుకోకుండా చక్కగా  నిద్ర పోయి ఆ తర్వాత చదవండి. దీనివల్లచదివినది బాగా గుర్తుంటుంది.

ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్, మసాలా పదార్ధాలు పక్కనపెట్టడంఉత్తమం . కొంచెం కొంచెం గా  బలమైన ఆహారం అంటే నట్స్, జ్యూస్‌లు, గుడ్లు ఇలాంటివి  తీసుకోవడం మంచిది. ఒక్కోసారి ఎంత చదువుతున్న  అసలు బుర్రకెక్కదు. అలాంటి  సమయంలో ఇంకా చదవడం కన్న కాస్తావిరామం తీసుకుని పాటలు వినడం లేదా ఇష్టమైన మరేదో పని చేయడం వంటివి చేయాలి. ఆ తర్వాతచదవడం మొదలు పెట్టాలి. అయినాకూడా  అలానే అనిపిస్తే  వేరే సబ్జెక్ట్ చదివిన తర్వాత  ఆ సబ్జెక్ట్ చదవాలి.

ఎంతసేపు చదవడమే కాకుండా  నడవడం, వ్యాయామం, పాటలు వినడం వంటివి కూడా చేస్తుండాలి.రేపు పరీక్షకి వెళ్తామనగా ఈ రోజే పరీక్షకి సంబందించిన వస్తువులు,వేసుకోవాలిసిన బట్టలు  అన్ని తీసి పక్కన పక్కన పెట్టుకోవడం వలన ప్రశాంతం గా ఉంటుంది.