NewsOrbit
హెల్త్

రక్తపోటుకూ కాలుష్యానికీ లింకు!

మనం ఉండే ఇల్లు, ప్రాంతం కూడా మనకు రక్తపోటు వచ్చే రిస్క్‌ను పెంచే అవకాశం ఉందని ఇటీవల ఒక అధ్యయనంలో బయటపడింది. అధిక రక్తపోటు మెటబాలిక్ సిండ్రోమ్‌లో భాగం. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, రక్తంలో చక్కెర శాతం ఎక్కువ  కావడం, కొల్లెస్ట్రాల్ పెరగడం మెటాబాలిక్ సిండ్రోమ్‌లోని ఇతర లక్షణాలు.

స్థూల కాయం, వయసు పెరగడం, జెనెటిక్స్, మధుమేహం మెటాబాలిక్ సిండ్రోమ్ రిస్క్‌ను పెంచుతాయి. అధిక రక్తపోటుకు కూడా ఇవి వర్తిస్తాయి. స్మోకింగ్, ఉప్పు శాతం ఎక్కువ ఉన్న తిండి, మద్యపానం, వత్తిడి కూడా అధిక రక్తపోటు రిస్క్‌ను పెంచుతాయి. నివాస ప్రాంతం, ఇల్లు కూడా ఈ మెటాబాలిక్ సిండ్రోమ్ లక్షణాలను పెంచే రిస్క్ కిందకు వస్తాయని అధ్యయనంలో తేలింది. లిథువేనియా పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ఫలితాలు జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించారు.

గతంలో కూడా ఇలాంటి పరిశోధనలు జరిగాయి కానీ ఫలితాలు ఖచ్చితంగా తేలలేదు. అయితే ఇలాంటి 17 అధ్యయనాల ఫలితాలను గుదిగుచ్చి సారాంశాన్ని 2016లో హైపర్‌టెన్షన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. కొన్ని రకాల వాతావరణ కాలుష్యాలకు దీర్ఘకాలం పాటు లోనయితే అధిక రక్తపోటు రిస్క్ పెరుగుతుందన్నది దాని సారాంశం.

తాజా అధ్యయనంలో ఈ వాతావరణపరమైన అంశాలకూ అధిక రక్తపోటు పెరగాడానికీ మధ్య లంకెను పరిశీలించారు. రక్తంలో మంచి కొల్లెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) తగ్గడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, స్థూలకాయం, రక్తంలో చక్కెర శాతం పెరగడం వంటి లక్షణాలతో ఉన్న లింకునూ పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి చిరునామాల ప్రకారం వారు ఎలాంటి కాలుష్యానికి గురవుతున్నదీ, వారికి దగ్గరలో ఏమైనా పార్కులు ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. వారికి స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉన్నదీ లేనిదీ, వ్యాయామం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

చివరికి, దీర్ఘకాలం పాటు కాలుష్యానికి గురయినందువల్ల మంచి కొల్లెస్ట్రాల్ తగ్గే అవకాశం పెరుగుతుందని తేల్చారు. ప్రధాన రహదారికి 200 మీటర్ల లోపు దూరంలో నివసించేవారికి అధిక రక్తపోటు రిస్క్ పెరుగుతుందని తేల్చారు. అపార్ట్‌మెంట్లలో నివసించేవారికే ఈ రిస్క్ పెరుగుతున్నట్లు, విడిగా ఉండే గృహాలలో నివసించేవారికి రిస్క్ లేనట్లు పరిశోధకులు గమనించారు.

ఇందులో ఇంకొక అంశం ఇమిడి ఉంది. అపార్ట్‌మెంట్లలో నివసించేవారికి సాధారణంగా విడి గృహాలలో నివసించేవారి కన్నా తక్కువ ఆదాయం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి పర్యవసానంగా అనారోగ్యం వచ్చే అవకాశాలు హెచ్చుతాయి. అధ్యయనంలో ఈ అంశాన్ని కూడా కొంతవరకూ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో దీని ప్రభావం తొలగించి చూడడం కష్టం. మొత్తం మీద నివసించే చోట వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్‌కు దగ్గరగా ఉండడం  ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు.

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment