21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
న్యూస్ హెల్త్

Sleep: ఒక గంట ఎక్కువ నిద్రపోతే జరిగే అధ్బుతం ఇదే..!! 

Share

Sleep: రాత్రిపూట అదనంగా నిద్ర పోవడం వలన శరీరంలో అనేక అద్భుతాలు జరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి ఒక గంట ఎక్కువసేపు నిద్రపోయేవారు మరుసటి రోజు ఎటువంటి ప్రయత్నం లేకుండా 270 తక్కువ క్యాలరీలు తింటారు.. ఈ రూల్ అధిక బరువు ఉన్నవారికి కూడా వర్తిస్తుంది.. ఇలా చేయడం ద్వారా మీరు ఒక సంవత్సరంలో 9 పౌండ్ల వరకు కోల్పోతారు. తాజాగా JAMA ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించబడింది.. ఈ అధ్యయనం యొక్క ప్రధాన రచయిత, చికాగో విశ్వవిద్యాలయంలోని రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఇస్రా తసాలి మాట్లాడుతూ.. ఒకరోజులో 270 క్యాలరీలు తగ్గటం అంటే చాలా పెద్ద విషయమని వెల్లడించారు.

Extra one hour sleep helps weight loss
Extra one hour sleep helps weight loss

సరియైన నిద్ర క్రమబద్ధీకరమైన ఆహారాన్ని అనుసరించడంలో ఈ అధ్యాయం సూచిస్తుంది. డాక్టర్ తసాలి 80 మందిపై పరిశోధన చేశారు ఇందులో బాడీ మాస్ ఇండెక్స్ 25 నుంచి 29.9 వరకు ఉన్నవారు అధిక బరువు గల సమూహంలో ఉంచబడ్డారు.. సగటున 30 మందికంటే ఎక్కువ మంది రాత్రి 6.5 గంటలకంటే తక్కువ సమయం నిద్రపోయారు.  అదనపు నిద్ర పొందిన వారు చాలా తక్కువ ఉన్నారు. అదనపు నిద్ర పొందిన వారు రోజుకు సగటున 270 తక్కువ క్యాలరీలను తింటున్నారని పరిశోధనలో వెల్లడించారు. ఇది వారి మూత్ర నమూనా ద్వారా లెక్కించబడ్డాయి.

 

 

మరొక అధ్యయనం ప్రకారం రాత్రి కేవలం నాలుగు గంటలు నిద్రపోయే వ్యక్తులు మరుసటి రోజు ఎక్కువ ఆహారం తింటారు.. ఇది దాదాపు 300 క్యాలరీలను అదనంగా ఉంటుందని ఇతర పరిశోధనలు నిద్రలేమి ఆకలిని అణిచివేసే హార్మోన్ లిఫ్ట్ ను స్థాయిలను తగ్గిస్తుందని తేలింది 2016లో “తసాలి ” చేసిన మునుపటి పరిశోధనలలో నిద్రలేమి ఉన్నవారిలో గ్రీన్ స్థాయిలు పెరిగాయని కనుగొన్నారు. ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఉప్పు, తీపి అధిక కొవ్వు పదార్థాలను కోరుకుంటారు. సమాజంలో ఊబకాయం మహమ్మారిని ఎదుర్కోవడంలో బాధపడే వారి కోసం ఈ అధ్యయనం గేమ్ చేంజర్ అని పరిశోధకులు భావిస్తున్నారు.


Share

Related posts

Pushpa: పుష్ప సినిమాకు పోటీగా సరైన సినిమా దిగబోతోంది..సుకుమార్‌కు పెద్ద టెన్షనే..!

GRK

కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి అప్ సెట్  … సంచ‌ల‌న నిర్ణ‌యం ?

sridhar

Tiredness: త్వరగా అలసిపోతున్నారా? కారణం ఇదే !!

Kumar