హెల్త్

మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసే సరికొత్త ఫేస్ ప్యాక్స్..!!

Share

అందమైన చర్మం కావాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి.అందంగా కనిపించాలని,ముఖం కాంతివంతగా మెరిసిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే చాలా మంది తమ ముఖానికి ఎక్కువగా మేకప్ పూయడం, మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడడం చేస్తూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం శున్యంగానే ఉంటుందని చెప్పాలి.అందుకే మేము చెప్పే కొన్ని సహజసిధ్ధ గృహ చిట్కాలు పాటిస్తే మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచే చిట్కాలు :
<img src="https://newsorbit.com/wp-content/uploads/2022/09/Screenshot_20220911-163720-300×163.jpg" alt="" width="300" height="163" class="size-medium wp-image-267771"

ఇందుకోసం ముందుగా తేనె, ఆల్మండ్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి చర్మం మిలమిలా మెరిసేలా చేస్తాయి.ముందుగా ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పవ్డర్ తీసుకుని, దానికి 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను బాగా కలిపి చక్కగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి పేస్ ప్యాక్ లాగా వేసుకుని 10-15 నిమిషాల పాటు మర్ధనా చేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

పేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలంటే..?
<img src="https://newsorbit.com/wp-content/uploads/2022/09/Screenshot_20220911-163709-300×163.jpg" alt="" width="300" height="163" class="size-medium wp-image-267772"

అలాగే మరొక పేస్ ప్యాక్ ఏంటంటే టొమోటో, ఓట్మీల్ పేస్ ప్యాక్..టొమోటో చర్మ సౌందర్యాన్ని పెంచే ఏజెంట్ గా పని చేస్తుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఓట్మీల్, కొద్దిగా టొమోటో రసాన్ని కలిపి మెత్తని గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని ఒక10 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

మరొక పేస్ ప్యాక్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్స్ పాలు, 2-3 చుక్కలు నిమ్మరసాన్ని వేసి పేస్ట్ గా చేసుకుని ముఖానికి పట్టించుకోవాలి.ఆ తర్వాత ఒక15 నిముషాల అయ్యాక ముఖాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే మీరే ఫలితాల్ని చూడవచ్చు.


Share

Related posts

ladies Health: మీ గర్ల్ ఫ్రెండ్ పీరియాడ్స్ లో ఉందా .. ఈ విషయం ఆమెకి వెంటనే చెప్పండి , లేదంటే తరవాత బాధపడతారు !

siddhu

ఆ సుఖాన్ని ఫోన్ లో బందించి తృప్తి పడుతున్న యువత!!

Kumar

Relationships అక్రమ సంబంధాలకు కారణాలు ఇవేనట.. ఇవి మీ జీవితంలో ఉంటే మీ భాగస్వామిని కాపాడుకోండి !!(పార్ట్-2)

Kumar