భార్యభర్తలు తరచూ శృంగారం లోపాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.శృంగారం చేయడం కూడా శారీరక వ్యాయామం తో సమానం అని సెక్సాలజిస్టులుచెప్తున్నారు. ఒక్కసారి శృంగారం లోపాల్గొనడం అనేది 30 నిమిషాల పాటు వేగంగా పరిగెత్తడం తో సమానమట.
శృంగారం చేయడం వల్ల శరీరం లోని క్యాలరీలు బాగా ఖర్చవుతాయని, మానసిక ఆరోగ్యం బాగుంటుందని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. శృంగారంలో పాల్గొనడం తో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అధికంగా శరీరంలో ఉత్పత్తి అవుతుంది.. అలా ఉత్పత్తి అయిన ఫలితం గా గాఢ నిద్ర పడుతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. శృంగారం లో పాల్గొన్న తర్వాత మగవారు 5నిమిషాల్లోనే నిద్రపోతారు … ఆడవారికి 20 నుండి 30 నిమిషాల లో మంచి నిద్రను పోతారని అనేక సర్వేలలో తెలిసింది.
దంపతులు ప్రతి వారం లో 4,5 సార్లు శృంగారం లో పాల్గొంటారో వారు అసలు వయసు కంటే పది సంవత్సరాలు చిన్నగా ఉండి యవ్వనం గా కనిపిస్తారు. తరచూ శృంగారం చేయడం వలన విపరీతమైన తలనొప్పి సమస్య కూడా సులువుగా తగ్గిపోతుంది. శృంగారం లో పాల్గొంటే ఒత్తిడి వలన కలిగే సమస్యలుచాల వరకు తొలగిపోతాయి.
శృంగారంలో ఎక్కువగా పాల్గొనడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శృంగారం తో ఆడవారికి పీరియడ్స్ లో నొప్పి తక్కువ వస్తుంది. వారానికి నాలుగు లేదా ఐదుసార్లు శృంగారం లో పాల్గొంటే ప్రొస్టేట్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ గా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. శృంగారంలో పాల్గొనడం వలన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.ప్రతి రోజూ శృంగారం చేసినప్పటికీ ఎటువంటి నష్టం కలగదని గమనించాలి.