Beer: ఈ రోజుల్లో అనేక మంది బరువు తగ్గడం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండటం లేదు. బరువు తగ్గించుకోవడం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ.. ఎంత ప్రయత్నించినా ఏమి చేసిన కూడా .. వాళ్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు మాత్రం కరగదు. ఎన్ని చేసినా కూడా పొట్ట తగ్గడం లేదని బెంగ పడుతుంటారు. పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడం కన్నా ముందు అది రావడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలి.
మన శరీరంలో మెగ్నీషియం ఎక్కువ ,తక్కువ కాకుండా సరిపోయేంత ఉండాలి. అలా కాకుండా ఒంట్లో సరిపోయేంత మెగ్నీషియం లేకపోతే ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం అనేది జరగదు. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరగడం చాలా కష్టం అనే చెప్పాలి. శరీరంలో సరిపోయేంత మెగ్నీషియం ఉండాలంటే.. క్రమం తప్పకుండా ఆకు కూరలు, బీన్స్, నట్స్ తీసుకోవడం చాలా అవసరం. మనిషికి సరిపడినంత నిద్ర లేకపోతే కనుక దాని వల్ల మానసికంగా ఒత్తిడి పెరిగే ప్రమాదం చాలా ఉంది. అది బరువు పై బాగా ప్రభావం చూపిస్తుంది. అంటే కనీసం ఆరేడు గంటలు కూడా నిద్ర లేని వాళ్ళు ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గారు దానితో పాటు పొట్ట దగ్గర కొవ్వు అయితే కరగనే కరగదు .సోడియాన్ని ఎక్కువగా తీసుకునే వాళ్లకు బరువు తగ్గడం కోసం ఎన్ని బరువు తగ్గే వ్యాయామం చేసినా పొట్టలో కొవ్వు మాత్రం తగ్గదు.
చాలామంది ఇష్టంగా తాగే బీరు కూడా పొట్టలో కొవ్వు పెరిగేలా చేస్తుంది.
బీరు ఎంత ఎక్కువగా తాగితే.. పొట్ట దగ్గర కూడా కొవ్వు అంత ఎక్కువ పెరుగుతుంది.కాబట్టి బీర్ ఎంత తక్కువ తాగితే మీకు పొట్ట అంత తక్కువగా ఉంటుంది.అంటే పొట్టని తగ్గించడం లో బీర్ బాగా పనిచేస్తుంది అనేగా అర్ధం.ఇలాంటి చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల బరువు తగ్గడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకపోగా .. మొదటికే మోసం వస్తుంది. అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.