Fennel: సోపు వంటకాల రుచిని పెంచడానికి కీలకపాత్ర పోషిస్తుంది.ఇందులో ఉండే గుణాలు చాలా వంటకాలను గుమగుమ లాడించడానికి సహాయపడుతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిని ఫేస్ ప్యాక్ గా వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై నల్ల మచ్చలు మరియు మొటిమలు , పిగ్మెంటేషన్లను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరిపించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఫేస్ ప్యాక్ వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
ఫెన్నెల్ ఫేస్ ప్యాక్ తయారీకి అవసరమైన పదార్థాలు:
1 టీ స్పూన్ సోపు పొడి,1టీ స్పూన్ పెరుగు..
ఫెన్నెల్ ఫేస్ ప్యాక్ తయారీ పద్ధతి:
ఫెన్నెల్ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి..అందులో 1టీ స్పూన్ ఫెన్నెల్ పౌడర్ 1-2 స్పూన్ పెరుగు వేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మిశ్రమం లా తయారుచేసుకోండి. అంతే సులభంగా ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వినియోగించడానికి ముందుగా.. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. తర్వాత ముఖం, మెడపై బాగా అప్లై చేయాల్సి ఉంటుంది. ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి.తర్వాత మంచి నీరుతో కడిగి శుభ్రం చేసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా వినియోగిస్తే మచ్చలు లేని మరియు మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.