హెల్త్

షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే ఈ నీళ్లు తాగాలిసిందే..!

Share

ప్రస్తుతకాలంలో అందరి ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఫలితంగా రకరకాల జబ్బుల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ముఖ్యంగా చాలా మంది వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధిన బారిన పడి జీవితాంతం మందులు వాడుతున్నారు. ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది ప్రతి ఒక్కరిని వీధించే సమస్య అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.షుగర్ వ్యాధిని తగ్గించుకోవడం కోసం డాక్టర్లు సూచించిన మందులలతో పాటుగా రోజూ వ్యాయామం చేస్తూ, సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి.అలాగే మందులతో పాటుగా
డయాబెటిస్ ను తగ్గించడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. మరి షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు మెంతులను ఎలా తీసుకోవాలో చూద్దాం..

మెంతి వాటర్ :

షుగర్ వ్యాదిని తగ్గించుకునెందుకు మెంతులను ఎలా ఉపయోగించాలంటే.. ముందుగా రాత్రి పడుకునేటప్పుడు ఒక రెండు టీస్పూన్ల మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో నానపెట్టిన మెంతుల నీటిని తాగాలి.


అలాగే మరొక చిట్కా ఏంటంటే వేడినీళల్లో మెంతులను ఉడకబెట్టి ఆ మెంతుల కషాయంను వడకొట్టి తాగిన కూడా షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. మెంతి వాటర్ తాగితే కేవలం షుగర్ వ్యాధి తగ్గడంతో పాటుగా అధిక బరువు కూడా తగ్గుతుంది.కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు కూడా ఉండవు.

 


Share

Related posts

Garlic: మన వంట గదిలో మనకి తెలియని ఒక గొప్ప ఔషదం దాగుంది తెలుసా..?

Ram

Self Confidence: మీలో ఉన్నది ఆత్మవిశ్వాసమా?అతి విశ్వాసమా?ఇలా తెలుసుకోండి!!

Kumar

Chapathi: చపాతీలు మృదువుగా ఉండి  కూర తో తినాల్సిన పని లేకుండా ఉండాలంటే ఇలా చేయండి!!

siddhu